Breaking News

రామ్ చరణ్ పెద్ది మూవీ.. తొలిసారి తెలుగులో డైలాగ్ చెప్పా: శివరాజ్‌ కుమార్

Published on Tue, 04/15/2025 - 21:08

కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో జరిగింది. ఈ షెడ్యూల్‌లో శివరాజ్‌ కుమార్‌ కూడా పాల్గొన్నారు. ‍అమెరికాలో క్యాన్సర్‌ చికిత్స చేయించుకుని కోలుకున్న తర్వాత షూటింగ్‌కు హాజరయ్యారు.

‍అయితే తెలుగులో మాత్రమే కాకుండా కన్నడలోనూ పలు సినిమాల్లో నటిస్తున్నారాయన. కన్నడ ‍స్టార్  ఉపేంద్ర, రాజ్ బి శెట్టి నటిస్తోన్న 45 మూవీలో శివరాజ్ కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్ శివుడిగా, ఉపేంద్ర యముడిగా, రాజ్ బి శెట్టి మార్కండేయగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ప్రెస్‌ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సమావేశంలో ఉపేంద్రతో పాటు శివరాజ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

(ఇది చదవండి: 'మనిషి చనిపోయాక చూపించే ప్రేమ.. ప్రాణాలతో ఉన్నప్పుడే చూపించండి')

శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. 'రామ్ చరణ్ పెద్ది మూవీ కోసం 2 రోజులు షూట్ చేశా. ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్‌ చాలా గుడ్ పర్సన్. నా షాట్‌ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్‌ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది. నాకు కీమో థెరపీ కంప్లీట్ చేసిన 4 రోజులకే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాను.. టీమ్ అందరూ ఇచ్చిన సపోర్ట్ తోనే షూట్ చేయగలిగాను' అని అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌ నడుస్తుండడంతో బెంగళూరు కప్ ‍కొట్టాలని కోరుకుంటున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ సాలా కప్ నమ్దే అని శివరాజ్ కుమార్‌ తన మద్దతు ప్రకటించారు. ఆర్సీబీకి కూడా ఒక్కసారి కప్‌ కొట్టే ఛాన్స్ ఇవ్వండని కోరారు.

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు