'పెద్ది'లో చరణ్‌ కోచ్‌గా స్టార్‌ హీరో.. ఫస్ట్‌లుక్‌ విడుదల

Published on Sat, 07/12/2025 - 10:32

రామ్‌ చరణ్‌- బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'.. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌తో చరణ్‌ మెప్పించాడు. తనదైన శైలిలో బ్యాట్‌ ఝుళిపించి పాన్‌ ఇండియా బాక్సాఫీస్‌ వద్ద ‘పెద్ది’ సంతకం ఎలా ఉండబోతుందో చూపించాడు. అయితే, తాజాగా మరో స్టార్‌ హీరో ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా 'పెద్ది' సినిమాలో ఆయన లుక్‌ ఎలా ఉంటుందో మేకర్స్‌ రివీల్‌ చేశారు. ఇదే సమయంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తన పాత్ర పేరు 'గౌర్నాయుడు' అని రివీల్‌ చేశారు.

పెద్ది సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతుంది. ఇప్పటికే  2 రోజులు షూట్ కూడా పూర్తి చేసినట్లు శివరాజ్‌కుమార్‌ గతంలో ఇలా చెప్పారు. 'ఆ రెండు రోజులు చాలా సరదాగా అనిపించింది. తొలిసారి తెలుగులో మాట్లాడా. డైరెక్టర్‌ చాలా గుడ్ పర్సన్. నా షాట్‌ను ఆయన అభినందించారు. రామ్ చరణ్ బిహేవియర్‌ వెరీ గుడ్. ఈ సినిమాలో తొలిసారిగా తెలుగులో డైలాగ్ చెప్పాను. పెద్దిలో నా రోల్ చాలా స్పెషల్. బుచ్చిబాబు స్క్రిప్ట్ చాలా నచ్చింది.' అని ఆయన అన్నారు. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు కోచ్‌గా శివరాజ్‌కుమార్‌ నటిస్తున్నట్లు సమాచారం.

వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మాత. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. శివరాజ్‌ కుమార్‌తో పాటు జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్స్‌ ఇందులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)