Breaking News

ఓటీటీలో 'కంగువా' స్ట్రీమింగ్‌ అప్‌డేట్

Published on Sun, 11/24/2024 - 16:27

కోలీవుడ్‌ టాప్‌ హీరో సూర్య నటించిన కంగువా సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నవంబరు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేదు. దీంతో సూర్య కెరీర్‌లో దారుణమైన నష్టాలను ఈ చిత్ర నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్‌ వారు ఎదుర్కోనున్నారు. కంగువా సినిమా ఓటీటీ రైట్స్‌ను అత్యధిక ధరకు అమెజాన్‌ దక్కించుకుంది. దీంతో  ఒక రకంగా చిత్ర నిర్మాతలను ఈ ఓటీటీ సంస్థే కాపాడినట్లు అయింది.

కంగువా ఓటీటీ రైట్స్‌ దక్కించుకున్నట్లు గతంలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.  డిసెంబర్‌ 13న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 130 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు సమాచారం. అయితే, అమెజాన్‌ ప్రైమ్‌ మాత్రం రూ. 100 కోట్లకు కంగువా రైట్స్‌ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఉంది.

కంగువా సినిమా ప్రారంభంలో 30 నిమిషాల పాటు చాలా బోరింగ్‌గా ఉందని ప్రచారం రావడంతో మూవీ నుంచి 12 నిమిషాల పాటు కొన్ని సీన్లు తొలగించారు. జ్యోతిక కూడా సినిమాపై ఇదే విమర్శ చేసింది. సూర్య,బాబీ డియోల్,దిశా పటాని నటించిన ఈ చిత్రాన్ని శివ దర్శకత్వం వహించారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)