Breaking News

ఓటీటీలో సడెన్‌గా 'ఎమర్జెన్సీ ' ఎంట్రీ

Published on Fri, 03/14/2025 - 08:37

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie). భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని కంగనానే నిర్మించారు. పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే, సడెన్‌గా  ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. వాస్తవంగా ఎమర్జెన్సీ మూవీని మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు కంగనా ప్రకటించింది. కానీ, అనుకున్న సమయంకంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.

ఎమర్జెన్సీ చిత్రం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ప్రకటించిన సమయం కంటే మూడు రోజులు ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేయడంతో ఫ్యాన్స్‌ వరుస ట్వీట్లు చేస్తున్నారు. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన  కంగనా రనౌత్‌ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు. కంగనా ఇందులో ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్‌ ఖేర్‌, శ్రేయాస్‌ తల్పడే, విశాక్‌ నాయర్‌, మిలింద్‌ సోమన్‌ సహా దివంగత నటుడు సతీశ్‌ కౌశిక్‌ ముఖ్య పాత్రలు పోషించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)