ఎంపీ కుమార్తె పెళ్లిలో కంగన డ్యాన్స్.. వీడియో వైరల్

Published on Mon, 12/08/2025 - 19:15

హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం భాజాపా తరఫున ఎంపీగా ఉన్న కంగనా రనౌత్.. ఈ మధ్య పెద్దగా వార్తల్లో కనిపించట్లేదు. లేదంటే ఎప్పుడో ఏదో విషయమై హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. చాన్నాళ్ల తర్వాత ఈమె గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. దానికి కారణం ఓ పెళ్లిలో ఈమె చేసిన డ్యాన్స్. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్)

గత కొన్నాళ్లు నుంచి చూసుకుంటే కంగన పేరు చెప్పగానే ఫైర్ బ్రాండ్ అనే మాటనే గుర్తొస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకులు, హీరోయిన్లు.. ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలు చేసింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపైన విరుచుకుపడింది. అవార్డ్ ఫంక్షన్స్‌లో, డ్యాన్సులు చేయడం లాంటి వాటికి ఈమె పూర్తిగా వ్యతిరేకి. అలాంటిది ఇప్పుడు ప్రముఖ పారిశ్రామికవేత్త, సహచర ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె పెళ్లిలో డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

స్టేజీపై ఎంపీ నవీన్ జిందాల్‌తోపాటు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఎన్‌సీపీకి ఎంపీ సుప్రియా సులేతో పాటు వేదికగా కంగన కూడా హుషారుగా స్టెప్పులేసింది. అయితే ఈ వీడియోపై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మూడు వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఒకే చోట కలిసి స్టెప్పులేయడమే దీనికి కారణం.

(ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)

Videos

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!

తిరుపతికి కొత్త రైలు..16వేల‌ కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్

పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు

Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ

KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్

Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత

Photos

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)

+5

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)

+5

యూత్‌ను గ్లామర్‌తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)