Breaking News

కంగనా రనౌత్ రెస్టారెంట్‌.. తొలి కస్టమర్‌గా స్టార్ హీరోయిన్‌!

Published on Wed, 02/05/2025 - 18:56

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వ్యాపారం రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో తన బిజినెస్‌ను ప్రారంభించనుంది. అందమైన పర్వతాల మధ్యలో సరికొత్త  రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మనాలిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్‌కు ది మౌంటైన్ స్టోరీ అనే పేరును కూడా ఖరారు చేసింది.  తన కొత్త రెస్టారెంట్‌కు మొదటి కస్టమర్‌గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆహ్వానించింది కంగనా రనౌత్. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఏర్పాటు చేసిన ది మౌంటైన్ స్టోరీ రెస్టారెంట్‌ను ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కంగనా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఈ సందర్భంగా  రెస్టారెంట్‌ను తెరవాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ తాను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను షేర్ చేసింది. ప్రపంచస్థాయి మెనూను కలిగి ఉండాలనుకునే రెస్టారెంట్‌ను తెరవాలనుకుంటున్నా అని కంగనా అ‍న్నారు. అదే ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపిక పదుకొణె  నీ రెస్టారెంట్‌కు నేనే  మీ మొదటి క్లయింట్ అవుతానని చెప్పింది. మరోసారి ఆ వీడియోను షేర్ చేస్తూ దీపికా పదుకొణె నా నా మొదటి కస్టమర్‌గా వస్తానని ప్రామిస్ చేశావ్ అంటూ కంగనా పోస్ట్ చేసింది. అంతేకాకుండా రెస్టారెంట్ ప్రారంభించడం చిన్ననాటి కల అని వెల్లడించింది. కాగా.. సినిమాల విషయానికొస్తే కంగనా రనౌత్ చివరిగా ఎమర్జెన్సీలో కనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీకి కంగనానే దర్శకత్వం వహించారు.
 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)