Breaking News

ధురంధర్‌ హీరోతో మూవీ.. స్పందించిన సౌత్‌ హీరోయిన్‌

Published on Sat, 01/10/2026 - 18:06

మలయాళ హీరోయిన్‌ కల్యాణి ప్రియదర్శన్‌ 'లోక చాప్టర్‌ 1: చంద్ర' మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ ఉమెన్‌ సెంట్రిక్‌ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.300 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో లోక సినిమాతో పాటు కల్యాణి పేరు కూడా నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయింది. ఈ క్రమంలోనే కల్యాణికి బాలీవుడ్‌ నుంచి కబురు వచ్చినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

ధురంధర్‌ హీరో సరసన..
ధురంధర్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన రణ్‌వీర్‌ సింగ్‌ నెక్స్ట్‌ మూవీ 'ప్రళయ్‌' (ప్రచారంలో ఉన్న టైటిల్‌)లో కల్యాణి యాక్ట్‌ చేయనుందంటూ బాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ఎట్టకేలకు కల్యాణి ప్రియదర్శన్‌ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు.. కానీ భాషతో సంబంధం లేకుండా మంచి కథలు ఎప్పుడూ నన్ను వెతుక్కుంటూ వస్తాయి. మంచి కథలు చేయాలన్న అత్యాశ నాకు చాలా ఎక్కువ.

అన్నీ నాకే కావాలి!
మంచి కథ ఉందంటే మాత్రం.. అది హిందీ, మరాఠి, కన్నడ, తమిళ, తెలుగు, మలయాళం.. ఏ ఇండస్ట్రీ అయినా సరే, అది నాకు సొంతం కావాలని అనుకుంటాను. అలా అని కుప్పలుతెప్పలుగా ఒకేసారి పది సనిమాలు చేయలేను. కథ బాగుంటే భాష నాకు అడ్డంకే కాదు అని తెలిపింది.

ప్రళయ్‌ సినిమా!
ప్రళయ్‌ విషయానికి వస్తే.. జాంబీల నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ సినిమాకు జై మెహతా దర్వకత్వం వహిస్తారని, ప్రస్తుతానికి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్‌ పాత్ర కోసం కల్యాణిని సంప్రదించారట! ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటే మాత్రం తను నటించబోయే తొలి స్ట్రయిట్‌ హిందీ సినిమా ప్రళయ్‌ అవుతుంది.

చదవండి: పరిస్థితి మా చేయిదాటింది: జననాయగణ్‌ నిర్మాత భావోద్వేగం

Videos

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)