Breaking News

అది వారి వ్యక్తిగత విషయం.. మనకు అవసరం లేదు: కాజోల్

Published on Sun, 07/27/2025 - 12:59

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తాజాగా సర్‌జమీన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జంటగా కనిపించింది.  దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీలో  ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాజోల్‌.. మెహర్ అనే పాత్రలో కనిపించారు. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాజోల్.. అందం, గ్లామర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్మెటిక్ సర్జరీ, బోటాక్స్ గురించి ప్రస్తావించింది. అందం కోసం ఇలాంటి చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయమని పేర్కొంది.  అలాంటి వారిని మనం జడ్జ్‌ చేయకూడదని తెలిపింది. ఆ విషయాన్ని వారికే వదిలేయాలని హితవు పలికింది. కాస్మోటిక్ సర్జరీలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని.. ఈ రోజుల్లో పురుషులు కూడా చేయించుకుంటున్నారని వెల్లడించింది.

కాజోల్ మాట్లాడుతూ.. 'కత్తి కిందకు వెళ్లాలా, వద్దా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. అందుకే ఇలాంటి విషయాలను అది వారికే వదిలివేయాలి. వాటిని మనం ప్రశ్నించకూడదు.  ఇది కేవలం జెండర్‌కు సంబంధించినది కాదు. చాలా మంది పురుషులు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ సమానమే.. వృద్ధాప్యం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. అయితే వృద్ధాప్యాన్ని చేరుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది.   కొంతమంది చిన్న వయస్సులోనే మరణించడంతో అసలు వృద్ధాప్యం పొందే అవకాశమే లేదు. అలాంటి వారు అదృష్టవంతులని కాదు. అంటే వారికి వృద్ధాప్యాన్ని అనుభవించడానికి, జీవితంలో ముందుకు పోయే ఛాన్స్‌ లేదు. అందుకే నాకు జీవించడానికి ఇంకా చాలా అద్భుతమైన సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నా' అని అన్నారు.
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు