Breaking News

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్‌.. ఎక్కువకాలం భరించాల్సిన పని లేదు!

Published on Wed, 11/12/2025 - 15:20

మనం తినే ఆహారపదార్థాలకు, వాడే వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉన్నట్లే పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉండాలంటోంది బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ (Kajol). అది తప్పేం కాదని సమర్థిస్తోంది. కాజోల్‌, ట్వింకిల్‌ ఖన్నా జంటగా హోస్ట్‌ చేస్తున్న షో 'టూ మచ్‌ విత్‌ కాజోల్‌'. తాజా ఎపిసోడ్‌కు విక్కీ కౌశల్‌, కృతి సనన్‌ గెస్టులుగా విచ్చేశారు. వీరితో ముచ్చటించే క్రమంలో పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్‌, రెన్యువల్‌ ఆప్షన్‌ ఉండాలా? అన్న ప్రశ్న తలెత్తింది.

ఎక్స్‌పైరీ డేట్‌ ఉండాల్సిందే!
వివాహానికి ఎక్స్‌పైరీ ఏంటి? అని కృతి సనన్‌, విక్కీ కౌశల్‌, ట్వింకిల్‌ ఖన్నా తల బాదుకుంటే.. కాజోల్‌ మాత్రం ఆ ఐడియాకు ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చింది. అది చూసిన ట్వింకిల్‌.. ఇది పెళ్లి, వాషింగ్‌ మెషిన్‌ కాదని గుర్తు చేసింది. అందుకు కాజోల్‌.. వివాహబంధానికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటే మంచిదే అనిపిస్తోంది. కరెక్ట్‌ పర్సన్‌నే పెళ్లి చేసుకున్నామన్న గ్యారెంటీ ఏంటి? అలాంటి సందర్భాల్లో ఈ ఎక్స్‌పైరీ డేట్‌ పుణ్యమా అని జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. 

ఓటీటీలో టాక్‌ షో
అలాగే రెన్యువల్‌ ఆప్షన్‌ ఉంటే ఉన్నచోటే ఆగిపోకుండా ముందడుగు వేయొచ్చు అని పేర్కొంది. 'టూమచ్‌ విత్‌ కాజోల్‌ అండ్‌ ట్వింకిల్‌' (Two Much with Kajol and Twinkle) టాక్‌ షో అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోంది. ప్రతి గురువారం ఒక కొత్త ఎపిసోడ్‌ రిలీజ్‌ అవుతుంది. కాజోల్‌ విషయానికి వస్తే.. 1999లో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూతురు నైసా దేవ్‌గణ్‌ సంతానం.

చదవండి: 14 ఏళ్లుగా ప్రేమ లేకపోయినా కలిసుంటున్నాం: నటి

Videos

Adilabad: పిడిగుద్దులతో రెచ్చిపోయిన కాంగ్రెస్, బీఆర్ఎస్

జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా

Prakash Raj: అవును.. నేను చేసింది తప్పే

మీడియాను ఘోరంగా అవమానించిన లోకేష్

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

కేతిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం భారీ ర్యాలీ

మా MROలు వేస్ట్.. జనసేన నేత సంచలన కామెంట్స్

Vidadala Rajini: రాసిపెట్టుకోండి.. జగనన్న ఒకసారి చెప్పాడంటే

New Delhi: పేలుడు ఘటన బాధితులను పరామర్శించిన మోదీ

కపిలతీర్థంలో అయ్యప్ప స్వాములకు అవమానం

Photos

+5

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్‌ లుక్‌లో సురేఖవాణి కూతురు సుప్రీత (ఫొటోలు)

+5

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం..కోటి గొంతుకలతో సింహగర్జన (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (ఫొటోలు)

+5

ఈ ఆలయం లో శివుడు తలక్రిందులుగా ఉంటాడు...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీ ప్రెస్‌మీట్‌లో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)

+5

వణికిస్తున్న చలి.. జాగ్రత్తగా ఉండాల్సిందే (ఫొటోలు)

+5

అల్లరి నరేశ్ 12ఏ రైల్వే కాలనీ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెహమాన్ కన్సర్ట్ జ్ఞాపకాలతో మంగ్లీ (ఫొటోలు)