Breaking News

పెద్దితో స్పెషల్‌ సాంగ్‌?

Published on Sun, 04/20/2025 - 00:10

‘నేను పక్కా లోకల్‌ పక్కా లోకల్‌.. పక్కా లోకలే...’ అంటూ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ వేసిన డ్యాన్సుల్ని ప్రేక్షకులు అంత సులువుగా మరచి పోలేరు. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్‌’(2016) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో సందడి చేశారీ బ్యూటీ. ఎన్టీఆర్‌కి సమానంగా డ్యాన్సులతో అదరగొట్టారామె. ఆ చిత్రం తర్వాత మరో ప్రత్యేక పాట చేయలేదు కాజల్‌. అయితే ఆమె తెలుగులో రెండోసారి స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నారని టాక్‌. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ మూవీలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుందట. ఈ పాటకి కాజల్‌ని తీసుకోవాలన్నది బుచ్చిబాబు ఆలోచనట. సినిమాకి ఓ హైలెట్‌గా నిలవనున్న ఈ పాటలో రామ్‌ చరణ్‌తో కలిసి ఆమె డ్యాన్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్‌చరణ్‌ –కాజల్‌ హీరో హీరోయిన్లుగా నటించిన తొలి చిత్రం ‘మగధీర’ (2009) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ద్వితీయ చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే’ (2014) కూడా విజయం అందుకుంది. ఇప్పుడు ‘పెద్ది’లో కాజల్‌ ఐటమ్‌ సాంగ్‌ చేస్తే... దాదాపు పదకొండేళ్ల తర్వాత వీరిద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లు అవుతుంది. మరి.. ‘పెద్ది’లో ఐటమ్‌ సాంగ్‌ ఉందా? ఉంటే కాజల్‌ అగర్వాల్‌ నటిస్తారా? అనే విషయాలపై అధికారిక ప్రకటన రావాలంటే వేచి చూడాలి. జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు కెమేరామేన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రం రామ్‌చరణ్‌ బర్త్‌ డేకి 2026 మార్చి 27న విడుదల కానుంది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)