Breaking News

థ్రిల్లర్ సిరీస్ తెలుగు రీమేక్‌లో కాజల్

Published on Fri, 12/12/2025 - 15:50

కొన్నేళ్ల క్రితం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వరస సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు కొత్తగా సినిమాలేం చేయట్లేదు. ఈ ఏడాది 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ ఈమెకు ఇదేం కలిసి రాలేదు. చేతిలో పలు చిత్రాలు ఉన్నప్పటికీ అందులో ఈమె లీడ్ రోల్స్ చేయట్లేదు. అలాంటిది ఇప్పుడు కాజల్.. ఓటీటీలోకి రీఎంట్రీకి ఇచ్చేందుకు సిద్ధమైపోయింది.

గతంలో 'లైవ్ టెలికాస్ట్' ఓ సిరీస్ చేసినప్పటికీ కాజల్‌కి ఇది పెద్దగా కలిసి రాలేదు. దీంతో సినిమా అవకాశాలు వస్తుండటంతో ఓటీటీలకు పెద్దగా ఆసక్తి చూపించినట్లు లేదు. ఇప్పుడు చేతిలో మూవీస్ లేకపోవడంతో వెబ్ సిరీస్ రీమేక్‌కి సై అన్నట్లు ఉంది. 'ఆర్య' పేరుతో హిందీలో ఓ వెబ్ సిరీస్ ఉంది. సుస్మితా సేన్ లీడ్ రోల్ చేసింది. ఇప్పటివరకు మూడు సీజన్లు వచ్చాయి. థ్రిల్లింగ్ అంశాలతో ఇది మెప్పించింది.

(ఇదీ చదవండి: 'అఖండ 2'కి హైదరాబాద్‌లోనే 3 కోట్ల టికెట్స్ సేల్.. ఇదెక్కడి అతి!?)

ఇప్పుడు ఈ సిరీస్ తెలుగు రీమేక్‌లోనే లీడ్ రోల్ కోసం కాజల్‌ని తీసుకున్నారట. తమిళంలో కూడా ఈమె తెలుసు. కాబట్టి దక్షిణాది వరకు ఈమెతో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారట. ఇది ఖరారైనప్పటికీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశముంది.

రీసెంట్‌గానే హాట్‌స్టార్ 'సౌత్ బౌండ్' పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహించింది. ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి ఇచ్చింది. ఇందులో భాగంగానే కాజల్‌కి కూడా సిరీస్ రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్‌లో ప్రధాన పాత్రకు ముగ్గురు పిల్లలు ఉంటారు. మరి ఇందులోనూ అలానే చూపిస్తారా లేదంటే ఏమైనా మార్పులు చేస్తారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: మమ్ముట్టి డిటెక్టివ్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ డేట్‌ ఇదే..)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)