Breaking News

బికినీ వేసుకోవడంపై కాజల్ రియాక్షన్

Published on Tue, 07/14/2026 - 08:58

సినిమా ఒక ఎంటర్‌టైన్‌మెంట్. అది ఒక అట్రాక్షన్‌. ఎలాంటి చిత్రానికైన బీజం ప్రేమే. ఆ ప్రేమలో అనేక అంశాలు దాగి ఉంటాయి. అందులో అందాలు ఆరబోసే గ్లామర్‌ ఉంటుంది. బికినీ అందాలతో కవ్వించే సీన్స్ ఉంటాయి. నయనతార, అనుష్క లాంటి టాప్‌ స్టార్స్‌ నుంచి యంగ్ హీరోయిన్ల వరకు తమ అందాలను బికినీ దుస్తుల్లో ఆరబోస్తుంటారు. తద్వారా పాపులర్‌ అవుతుంటారు. హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌ మాత్రం తాను బికినీ దుస్తులకు పూర్తి వ్యతిరేకిని అని చెప్పింది.

(ఇదీ చదవండి: కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి)

నిజం చెప్పాలంటే కాజల్ కూడా గ్లామరస్‌ నటనతోనే స్టార్‌ హీరోయిన్‌ అయింది. తెలుగు ,తమిళ, హిందీ తదితర భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగులో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ తదితర స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. పెళ్లి తర్వాత నటనకు చిన్న బ్రేక్‌ ఇచ్చిన కాజల్‌.. గత కొన్నేళ్లుగా మళ్లీ సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన 'ది ఇండియా స్టోరీ' అనే పాన్‌ ఇండియా చిత్ర విడుదలకు సిద్ధమైంది. ఈనెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు బికినీ దుస్తుల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పింది.

అంతేకాదు సినిమాల్లో హద్దులు మీరిన రొమాంటిక్ సీన్స్‌లోనూ నటించనని కాజల్ చెప్పుకొచ్చింది. తనకు తాను కొన్ని హద్దులు విధించుకున్నానని పేర్కొంది. కాదు కూడదు అంటే అలాంటి చిత్రాల్లో నటించలేనని స్పష్టంగా చెప్పింది. అది ఎంత భారీ బడ్జెట్‌ చిత్రం అయినా, ఎంత ముఖ్యమైన పాత్ర అయినా తనకు చింత లేదని స్పష్టం చేసింది. నటన విషయంలో తనకంటూ ఒక పరిమితిని పెట్టుకున్నట్లు , దాన్ని తాను కచ్చితంగా పాటిస్తానని నటి కాజల్‌ పేర్కొంది. 

(ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో సింగర్ పెళ్లి.. తనకంటే భార్య 16 ఏళ్లు చిన్నది)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)