Breaking News

'రామాయణ్'లో కాజల్ అగర్వాల్.. అలాంటి పాత్రలోనా?

Published on Fri, 05/16/2025 - 16:15

రామాయణం ఆధారంగా మన దేశంలో చాలా సినిమాలు ఇదివరకే తీశారు. తీస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ 'ఆదిపురుష్' ఇలానే తీశారు. కానీ గ్రాఫిక్స్, పాత్రల తీరుతెన్నులు దారుణంగా ఉండేసరికి విపరీతమైన విమర్శలు వచ్చాయి. కట్ చేస్తే ఇ‍ప్పుడు 'రామాయణ్' పేరుతో హిందీలో మళ్లీ సినిమా తీస్తున్నారు.

ఇ‍ప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో 'యానిమల్' ఫేమ్ రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తుండగా, సాయిపల్లవి సీత పాత్ర చేస్తోంది. 'కేజీఎఫ్' యష్ రావణుడిగా నటిస్తున్నాడు. మిగిలిన పాత్రల కోసం పలు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఎవరిని ఫైనల్ చేశారనేది ఇంకా బయటపెట్టలేదు.

(ఇదీ చదవండి: ‍శవంతో కామెడీ.. క్రేజీ డార్క్ కామెడీ మూవీ రివ్యూ (ఓటీటీ )) 

ప్రస్తుతానికైతే మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. రావణుడి భార్య పేరు మండోదరి. రామాయణ్ మూవీలో ఈమె పాత్రకు చాలా తక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు. మరి కాజల్ నిజంగా ఒప్పుకొందా? లేదంటే ఇవి రూమర్స్ మాత్రమేనా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రావొచ్చు.

నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027లో రెండో భాగం రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీతో దర్శకనిర్మాతలు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి?

(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)