Breaking News

కాజల్ అగర్వాల్‌కి ఇది చివరి అవకాశం!

Published on Mon, 04/27/2026 - 17:00

టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు పూర్తిగా వెనకబడిపోయింది. అప్పుడెప్పుడో 2017లో వచ్చిన 'నేనే రాజు నేనే మంత్రి'లో అద్భుతమైన యాక్టింగ్ చేసి హిట్ కొట్టింది. తర్వాత చేసిన వాటిలో మూడేళ్ల క్రితం 'భగవంత్ కేసరి' మాత్రమే సక్సెస్ అందుకుంది. ఇందులో ఈమెది పెద్దగా గుర్తింపు లేని పాత్ర కావడం వల్ల హిట్ క్రెడిట్ రాలేదు. గతేడాది రిలీజైన 'కన్నప్ప'లో పార్వతి దేవిగా కనిపించింది గానీ వర్కౌట్ కాలేదు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సోషల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

ఓ రకంగా చెప్పాలంటే కాజల్ కెరీర్ చివరి దశలో ఉంది. ఇలాంటి టైంలో ఈమె లాయర్‌గా లీడ్ రోల్ చేసిన 'ద ఇండియన్ స్టోరీ' సినిమా విడుదలకు సిద్ధమైంది. లెక్క ప్రకారం గతేడాది ఆగస్టులోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకున్నారు. గతేడాది అక్టోబరులోనే షూటింగ్ పూర్తవగా ఇన్నాళ్లకు రిలీజ్ డేట్ ప్రకటించారు.

జూలై 24 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని పోస్టర్ వదిలారు. ఇందులో కాజల్‌తోపాటు మరాఠీ స్టార్ నటుడు శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్ర చేశాడు. పంటకు ఉపయోగించే రసాయనాల దుర్వినియోగం, సాగులో పురుగు మందుల మితిమీరిన వినియోగం, దీని వెనకున్న భారీ కుంభకోణాల నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.

ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా మూవీస్ చేయాలనుకుంటే మాత్రం ఇది హిట్ కావడం కాజల్‌కి చాలా కీలకం. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇంకొన్ని ఆఫర్స్ వస్తాయి. లేదంటే మాత్రం మెల్లగా ఈమెని పట్టించుకోవడం దర్శకులు తగ్గించేస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: రవితేజ.. 'అక్కాయిలు బాగున్నారా?')

Videos

కవిత పార్టీపై కేటీఆర్ రియాక్షన్

ఘోర ప్రమాదం కార్మికులపై కూలిన క్రేన్

TDP చేసే రాజకీయాల కన్నా, ప్రాస్టిట్యూట్ చేసుకునే మహిళా చాల బెటర్

కొనసాగుతున్న బంగారం ధరల పతనం... గోల్డ్ కొన్నవారికి వరుస షాక్స్

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే..? బూడిదైన కార్లు..!

శవాన్ని ఎంత అలంకరించినా లేచి నిలబడదు..!

పోలీస్ వ్యవస్థ బతికే ఉంటే రాధాకృష్ణపై ఫిర్యాదు తీసుకోవాలి

కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్లు.. లక్షకు 5 లక్షలొచ్చాయ్..

తేజస్వీ సూర్య ఒక వెదవ

అంబర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Photos

+5

‘వదలా’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రెడ్‌ శారీలో ఫరియా అబ్దుల్లా క్యూట్ లుక్స్‌ (ఫొటోలు)

+5

మెరిసిపోతున్న మానస చౌదరి (ఫొటోలు)

+5

ఏపీకి కూటమి శాపం.. ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఇక్కడేందుకు? (ఫొటోలు)

+5

‘ఏక్‌ దిన్‌’ మూవీ మ్యూజికల్‌ ఈవెంట్‌లో సాయి పల్లవి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆకట్టుకున్న ‘సాక్షి’ హ్యాపీ కిడ్స్‌ ఈవెనింగ్‌ (ఫొటోలు)

+5

హనీ ఈజ్‌ ది బెస్ట్‌.. పెళ్లి చేసుకున్న నటి మోహరీన్‌ (ఫోటోలు)

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)