Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం
Breaking News
ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా
Published on Mon, 05/05/2025 - 20:15
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 15కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు యాడ్ అయింది. అస్సలు ఇంగ్లీష్ పదాలే వాడకుండా తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుందని ఇప్పుడు చూద్దాం?
అందరూ కొత్తవాళ్లతో తీసిన సినిమా 'కాలమే కరిగింది?'. మార్చి 21న ఈ తెలుగు మూవీ థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే పెద్దగా పేరున్న నటీనటులు ఎవరూ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఈ మూవీలో సారీ, థ్యాంక్స్ తప్ప మరే ఇంగ్లీష్ పదాలు ఉపయోగించలేకపోవడం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
కథంతా స్కూల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇప్పుడీ చిత్రం మే 09 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.
'కాలమే కరిగింది?' విషయానికొస్తే.. ఫణి (వినయ్ కుమార్-అరవింద్) బాగా చదువుకుని జీవితంలో సెటిల్ అయ్యింటాడు. తొలి ప్రేమ గుర్తొచ్చి ప్రియురాలు బిందు (శ్రావణి-నోమిన తార) కోసం సొంతూరు వెళ్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: స్నానం కూడా చేయలేదు.. అమ‍్మ జీవితాంతం నన్ను..: రష్మీ)

Tags : 1