Breaking News

రిలీజ్‌కు ముందే ప్రపంచ రికార్డు కొట్టిన సినిమా.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published on Mon, 08/14/2023 - 10:09

దర్శకుడు కె. భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా  3.6.9. కేవలం 81 నిమిషాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రపంచ రికార్డు సాధించిన ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శివ మాదవ్‌ ఈ చిత్ర షూటింగ్‌ను 24 కెమెరాలతో 81 నిమిషాల్లో పూర్తి చేశారు. నటుడు పీజీఎస్‌ ప్రతి నాయకుడిగా నటించిన ఇందులో బ్లాక్‌ శాండీ, అంగయర్‌ కన్నన్‌, సుకై ల్‌ ప్రభు, కార్తీక్‌, గోవిందరరాజన్‌, సుభిక్ష, నిఖితా, బబ్లూ సహా 60 మందికి పైగా నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు.

వీరితో పాటు విదేశానికి చెందిన వారు సైతం నటించడం విశేషం. మారీశ్వరన్‌ ఛాయాగ్రహణం, కార్తీక్‌ హర్ష సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 25వ తేదీన తెరపైకి రానుంది. 600 మంది సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ సినిమా షూటింగ్‌ను నాలెడ్జ్‌ ఇంజినీరింగ్‌ అనే సంస్థకు చెందిన హరిభా హనీప్‌ సమక్షంలో చిత్రీకరించినట్లు యూనిట్‌ సభ్యులు తెలిపారు.

కాగా అమెరికాకు చెందిన వరల్డ్‌ రికార్డ్‌ యూనియన్‌ అనే సంస్థ ఈ 3.6.9 చిత్రానికి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందించినట్లు తెలిపారు. సైన్స్‌ ఇతివృతంగా రూపొందిన ఈ చిత్రం గురించి నటుడు కె.భాగ్యరాజ్‌ వివరిస్తూ.. 81 నిమిషాల్లో రూపొంది ప్రపంచ రికార్డు సాధించిన 3.6.9 చిత్రంలో తానూ ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన దర్శకుడు శివ మాధవ్‌, నిర్మాత పీజీఎస్‌ను అభినందిస్తున్నానన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నానని భాగ్యరాజ్‌ ఆకాంక్షించారు.

చదవండి: నాని నీ రేంజ్‌ ఏంటి..? వీళ్లందరూ గల్లీ హీరోలా..?

Videos

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)