Breaking News

తొలి సినిమా నా భర్తతో చేయడం మరిచిపోలేను: జ్యోతిక

Published on Thu, 02/27/2025 - 16:24

కోలీవుడ్ స్టార్ హీరో సతీమణి జ్యోతిక ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిస్తోంది. తాజాగా ఆమె  డబ్బా కార్టెల్‌ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారామె. అయితే ఈ సిరీస్‌ ప్రమోషన్లలో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరువుతున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జ్యోతిక తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్‌లో నటించడంపై ఆమె మాట్లాడారు.

బాలీవుడ్‌తో నా తొలిచిత్రం అక్షయ్‌ ఖన్నాతో నటించానని తెలిపింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.. అందువల్లే ఆ తర్వాత ఆఫర్లు రాలేదని వివరించింది. అది చేసే సమయంలో ఓ దక్షిణాది సినిమాకు సైన్‌ చేశానట్లు వెల్లడించింది. కోలీవుడ్‌లో తొలి సినిమానే నా భర్త సూర్యతో చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. స్టార్‌డమ్ గురించి ఆమెను ప్రశ్నించగా.. ఇంటికి వెళ్లేముందే బయటే తమ స్టార్‌డమ్‌ను వదిలేస్తామని తెలిపింది. ఇంట్లోకి అడుగుపెట్టగానే మా పిల్లలకు తల్లిదండ్రులుగానే ఉంటాం.. ప్రతి ఉదయం వారి బాక్స్‌ల గురించే ఆలోచిస్తామని.. వాళ్ల పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామని జ్యోతిక వెల్లడించింది.
 

కాగా..  తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్‌లో.. షబానా అజ్మీ, గజరాజ్‌, జ్యోతిక, నిమేషా సజయన్‌, షాలినీ పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ను హితేష్ భాటియా దర్శకత్వంలో తెరకెక్కించారు.  ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌  ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌  కానుంది. ఈ వెబ్ సిరీస్‌ను క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముంబయిలో డబ్బావాలా బాగా ఫేమస్. ఆ కోణంలోనే ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫుడ్‌ డబ్బాల్లో లంచ్‌తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా డబ్బా కార్టెల్‌ రూపొందించారు. ఈ సిరీస్‌లో అంజలి ప్రసాద్‌, సాయి తమంకర్‌ కీలకపాత్రలు పోషించారు. jyothika

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)