Breaking News

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

Published on Mon, 12/08/2025 - 17:08

తెలుగు స్టార్ హీరో జూ.ఎన్టీఆర్.. ఢిల్లీ హైకోర్ట్‌ని ఆశ్రయించాడు. వ్యక్తిత్వ హక్కులని రక్షించుకోవడంలో భాగంగానే పిటిషన్ వేశాడు. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ చేసిన ఫిర్యాదులపై.. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అలానే తదుపతి విచారణ ఈనెల 22వ తేదీకి వాయిదా పడింది. అదే రోజున సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ అరోరా చెప్పారు.

(ఇదీ చదవండి: 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం.. నందమూరి హీరో ఏమైపోయాడు?)

ఇటీవల కాలంలో ఇలానే చిరంజీవి, నాగార్జున కూడా హైకోర్ట్‌ని ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా పేరు, ఫొటో, వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడదని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇ‍ప్పుడు వీళ్ల బాటలోనే జూ.ఎన్టీఆర్ కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇకపై వాణిజ్య అవసరాల కోసం అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు లేదా ఫొటోని ఉపయోగిస్తే ఆలోచించాల్సిందే అనమాట.

ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చేస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇది థియేటర్లలోకి రానుందని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చిత్రీకరణ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ దిలీప్ కుమార్ తదితర దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. 

(ఇదీ చదవండి: దుబాయి యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్ ప్రేమ.. త్వరలో పెళ్లి)

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)