Breaking News

భార్యకు వండి పెడతా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్‌

Published on Wed, 08/06/2025 - 17:31

దేవర సినిమాతో సూపర్‌ హిట్టందుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) వార్‌ 2తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వచ్చేవారమే (ఆగస్టు 14న) ఈ మూవీ బాక్సాఫీస్‌లో సందడి చేయనుంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తారక్‌.. ఈస్క్వైర్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

అది నా ఫేవరెట్‌
ముందుగా బాలీవుడ్‌లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్‌ చేసుకోను. కుంగ్‌ఫు పాండా సినిమాలో ఓ డైలాగ్‌ ఉంటుంది. 'నిన్న ఒక చరిత్ర- రేపు ఓ రహస్యం- నేడు అనేది ఓ బహుమతి'. ఇది నా ఫేవరెట్‌. నేను గతం గురించి, జరగబోయేదాని గురించి ఆలోచించను. వర్తమానంపైనే ఫోకస్‌ చేస్తాను. వార్‌ 2 సినిమా విషయానికి వస్తే.. కథ నాకు బాగా నచ్చింది. అలాగే హృతిక్‌ సర్‌తో పని చేయాలన్న ఉత్సుకత వల్లే వార్‌ 2 మూవీకి ఓకే చెప్పాను.

నెలంతా షూటింగ్స్‌కే..
మొదట్లో ఫ్యామిలీని పక్కనపెట్టి మొత్తం సినిమాలకే పరిమితమయ్యాను. వారంలో ఏడురోజులు షూటింగ్‌కు వెళ్లేవాడిని. అంటే నెలలో 30 రోజులు షూటింగ్స్‌కే కేటాయించేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఆదివారం సెలవు తీసుకుంటున్నాను. నా పిల్లలు అభయ్‌, భార్గవకు సమయం కేటాయిస్తున్నాను. ఎందుకంటే వారితో నేను సరదాగా, ప్రశాంతంగా గడిపేది ఆ ఒక్కరోజే! 

వాళ్లకు నచ్చింది చేయనిస్తా
నా పిల్లలు కూడా నాలాగే యాక్టర్స్‌ కావాలని ఎప్పుడూ చెప్పను. అది చేయాలి, ఇది చేయాలని ఆదేశించడానికి బదులుగా వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతాను. ఇకపోతే నాకు వంట చేయడం ఇష్టం. నా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమగా వండిపెడతాను. తనకే కాదు, నా స్నేహితుల కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంట చేస్తుంటాను. నాకు బిర్యానీ ఇష్టమైన వంటకం అని తారక్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)