Breaking News

అభిమానులపై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆగ్రహం.. వెళ్లిపోతానంటూ..

Published on Sun, 04/13/2025 - 13:17

అన్న కల్యాణ్‌ రామ్‌ (Nandamuri Kalyan Ram) కోసం తమ్ముడు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) ఎప్పుడూ అండగా ఉంటాడు. కల్యాణ్‌ రామ్‌ నటించిన పలు సినిమాల ఈవెంట్లకు తారక్‌ స్పెషల్‌ గెస్టుగా వెళ్లాడు. తాజాగా మరోసారి అన్న కోసం తమ్ముడు కదిలాడు. కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రలో నటించిన అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా ట్రైలర్‌ లాంచ్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (Arjun S/o Vyjayanthi Pre Release Event) శనివారం (ఏప్రిల్‌ 12) జరిగింది. ఈ కార్యక్రమానికి తారక్‌ ముఖ్య అతిథిగా వచ్చేశాడు.

విజయశాంతిని మాట్లాడనివ్వని ఫ్యాన్స్‌
అతడిని చూసిన అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. అరుపులు, కేకలతో కార్యక్రమం దద్దరిల్లేలా చేశారు. అయితే స్టేజీపై ఎవరు మాట్లాడుతున్నా తన గురించే కేకలు వేస్తుండటంతో తారక్‌కు కోపమొచ్చింది. విజయశాంతి మైకు పట్టుకుని మాట్లాడుతున్నప్పుడు కూడా ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ అభిమానులు కేకలేశారు. సీఎం.. సీఎం.. అని నినదిస్తూ ఆమెను మాట్లాడనివ్వలేదు.

తారక్‌ ఆగ్రహం
ఒక్క నిమిషం సైలెంట్‌గా ఉంటే మాట్లాడతాను అని విజయశాంతి అభ్యర్థించినా అభిమానులు వినిపించుకోలేదు. దీంతో తారక్‌కు కోపమొచ్చింది. మౌనంగా ఉండకపోతే నేను స్టేజీపై నుంచి వెళ్లిపోతాను అంటూ సైగ చేశారు. దీంతో విజయశాంతి ఆయన్ను వెళ్లకుండా ఆపింది. మీ అభిమానుల ఉత్సాహం భయంకరంగా ఉంది. కట్రోల్‌ చేయలేకపోతున్నాం అంటూనే తన స్పీచ్‌ కొనసాగింది. 

NTR Fans

సినిమా
అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించారు. కల్యాణ్‌ రామ్‌కు జంటగా సాయి మంజ్రేకర్‌ నటించింది. ఈ మూవీ  ఏప్రిల్‌ 18న రిలీజ్‌ కానుంది.

చదవండి: తమన్నా-విజయ్‌ బ్రేకప్‌.. సలహా ఇచ్చిన చిరంజీవి?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)