Breaking News

రికార్డు సృష్టించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ 'డ్రాగన్‌' గ్లింప్స్‌

Published on Thu, 05/21/2026 - 12:44

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం డ్రాగన్‌. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్‌ బర్త్‌డే సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి డ్రాగన్‌ గ్లింప్స్‌ వదిలారు. సాధారణంగా గ్లింప్స్‌ అనగానే చాలా తక్కువ నిడివితో ఉన్న వీడియోను వదులుతారు. కానీ డ్రాగన్‌ యూనిట్‌ అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఏకంగా నాలుగు నిమిషాల నిడివితో గ్లింప్స్‌ వీడియో రిలీజ్‌ చేసింది. ఇందులో కథ గురించి, హీరో ఉన్న సామ్రాజ్యం గురించి చూపించారు. అలాగే విలన్స్‌ను హైలైట్‌ చేశారు.

గ్లింప్స్‌ రికార్డు
ఎన్టీఆర్‌ను క్రూరమైన పాత్రలో చూపించారు. 'పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు' అని ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ గ్లింప్స్‌ వీడియో అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. కేవలం 24 గంటల్లోనే రికార్డు వ్యూస్‌ రాబట్టింది. అన్ని భాషల్లో కలుపుకుని ఏకంగా 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇండియన్‌ సినిమాలో ఇప్పటివరకు ఏ గ్లింప్స్‌ వీడియోకు 24 గంటల్లో ఇంత పెద్ద మొత్తంలో వ్యూస్‌ రాలేదంటూ పోస్టర్‌ వదిలింది. ఇది చూసిన తారక్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

సినిమా
డ్రాగన్‌ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్‌ కథానాయికగా, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. బిజు మీనన్‌, ఖుష్బూ సుందర్‌, గురు సోమసుందరం, రాజీవ్‌ కనకాల, అషుతోష్‌ రానా, అన్షుమాన్‌ పుష్కర్‌, సిద్దాంత్‌ గుప్తా, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్నారు. రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్‌ మూవీ 2027 జూన్‌ 11న విడుదల కానుంది.

 

 

 

చదవండి: ఆ ఇద్దరు హీరోయిన్లకు పొగరు: డ్యాన్సర్‌

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్సీబీ ప్లేయర్ల ప్రాక్టీస్‌.. ఉప్పల్‌లో లాస్ట్‌ పంచ్‌ ఎవరిది (ఫొటోలు)

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)