Breaking News

RRRలో నటించా.. జెప్టో యాడ్‌లో కూడా నేనే.. : ఎన్టీఆర్‌ డూప్‌

Published on Wed, 04/23/2025 - 13:06

ఓపక్క సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే మరోపక్క నటుడిగా ప్రయత్నిస్తున్నాడు ఈశ్వర్‌ హారిస్‌. అంతేకాదు.. టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌కు బాడీ డబుల్‌ (డూప్‌)గా కూడా చేస్తున్నాడు. అంటే కొన్ని సీన్లలో తారక్‌ స్థానంలో ఈయనే నటిస్తాడన్నమాట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈశ్వర్‌ (Eshwar Harris).. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

అలా ఆర్‌ఆర్‌ఆర్‌లో అవకాశం
అతడు మాట్లాడుతూ.. జార్జ్‌ రెడ్డి సినిమాలో విలన్‌గా చిన్న పాత్రలో నటించాను. కొత్తపోరడు, పులిమేక వంటి వెబ్‌సిరీస్‌లు చేసుకుంటూ వచ్చాను. ఆచార్యలో రామ్‌చరణ్‌ ఫ్రెండ్‌గా నటించాను. అయితే ఎడిటింగ్‌లో నా సీన్లు పోయాయనుకోండి. కానీ ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి నువ్వు జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) లాగే ఉన్నావ్‌ అన్నాడు. రాజమౌళి టీమ్‌ నీ గురించి నెల రోజుల నుంచి వెతుకుతున్నారు అని చెప్పాడు. అలా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో భాగమయ్యాను.

కొమురం భీముడో పాటలో..
ఉదయం 6 గంటలకల్లా సెట్స్‌లో ఉండాలనేవారు. ఓరోజు నేను రావడం ఐదు నిమిషాలు ఆలస్యమయ్యేసరికి వందల ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. రాజమౌళి ఆరింటికే షూటింగ్‌ మొదలుపెట్టేస్తాడు. చాలా పక్కాగా ఉంటాడు. కొమురం భీముడో పాటలో మూడు, నాలుగు షాట్స్‌ నావే ఉంటాయి. తారక్‌ అన్న స్థానంలో నన్ను వేలాడదీశారు.. నా కాళ్లు, చేతులకు రక్తం కారే సన్నివేశాలు షూట్‌ చేశారు. ఆ పాటలో కాళ్లు, చేతులు నావే కనిపిస్తాయి. ఫైటింగ్స్‌లాంటివైతే నేనేం చేయలేదు.

వార్‌ 2 కోసం అడిగారు
మొన్న వార్‌ 2 సినిమా (War 2 Movie) కోసం అడిగారు. అర్జంట్‌గా ముంబై వచ్చేయాలన్నారు. కానీ విమానయాన ఛార్జీలకు కూడా డబ్బులివ్వనన్నారు. మనకన్నా బాలీవుడ్‌ దారుణంగా ఉందనిపించింది. రెమ్యునరేషన్‌ నచ్చకపోవడంతో రానని చెప్పేశాను. ఈ మధ్యే జూనియర్‌ ఎన్టీఆర్‌.. జెప్టో యాడ్‌ కూడా చేశాను. జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నను చూడగానే నాకు ఒక పాజిటివ్‌ వైబ్‌ వస్తుంది. సింగిల్‌ టేక్‌లో చాలా సింపుల్‌గా నటిస్తాడు.

జెప్టో యాడ్‌ చేశా..
అయితే యాడ్‌ షూటింగ్‌ అప్పుడు ఆయనకు కాస్త జ్వరం వచ్చింది. పైగా డైట్‌లో ఉన్నాడు. అసలే వార్‌ 2లో హృతిక్‌ రోషన్‌ను మ్యాచ్‌ చేయాలి కదా మరి! హృతిక్‌ను మ్యాచ్‌ చేయడమంటే మామూలు విషయం కాదు. జెప్టో యాడ్‌లో క్యారవాన్‌ ఇచ్చి మంచి భోజనం పెట్టి తారక్‌ అన్నతో సమానమైన గౌరవం ఇచ్చారు. బాడీ డబుల్‌గా చేసినప్పుడు సినిమాను బట్టి లక్షల్లో పారితోషికం ఇస్తారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈశ్వర్‌.. భీమా, స్వయంభూ వంటి పలు చిత్రాలు చేస్తున్నాడు.

 

 

చదవండి: సునీత మేడం.. వీటికి సమాధానం చెప్పండి: ప్రవస్తి

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)