Breaking News

డ్రగ్స్‌ ఇచ్చాడు, అలా ఫస్ట్‌ టైం జానీతో బెడ్‌ షేర్‌ చేసుకున్నా..

Published on Thu, 08/04/2022 - 18:21

హాలీవుడ్‌ హీరో జానీ డెప్‌ మీద సంచలన ఆరోపణలు చేసింది అతడి మాజీ ప్రేయసి ఎలెన్‌ బార్కిన్‌. తాము తొలిసారి శారీరకంగా కలవడానికి ముందు అతడు తనకు క్వాల్యూడ్‌ అనే డ్రగ్‌ ఇచ్చాడని ఆరోపించింది. ఆ సమయంలో అతడు బాగా తాగి తనను కంట్రోల్‌ చేయడమే కాక నోటికొచ్చినట్లు మాట్లాడాడని పేర్కొంది. జానీ మీద అంబర్‌ హెరాల్డ్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో సాక్షిగా ఉన్న ఆమె ఆరువేల పేజీలున్న కోర్టు డాక్యుమెంట్స్‌లో పై వ్యాఖ్యలు చేసింది.

జానీ ఎప్పుడూ తనను కట్టడి చేయాలని చూసేవాడంది. ఎవరితోనైనా కాస్త చనువుగా ఉంటే చాలు ఈర్ష్య పడేవాడంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? మీరిద్దరూ రాత్రంతా ఏం చేశారు? వంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. ఒకసారి తన వీపు మీద ఏదో గీత పడితే నేను ఎవరితోనో బెడ్‌ షేర్‌ చేసుకున్నానని అనుమానించాడని వాపోయింది. ఒకసారి తనకు క్వాల్యూడ్‌ అనే డ్రగ్‌ ఇచ్చాడని, అప్పుడే తామిద్దరం తొలిసారిగా బెడ్‌ షేర్‌ చేసుకున్నామని పేర్కొంది.

కొన్ని నెలలపాటు తమ బంధం కొనసాగిందని, ఆ సమయంలో వారానికి మూడు, నాలుగు రోజులు ఒకరింటికి మరొకరం వెళ్లి కలుసుకునేవాళ్లమని తెలిపింది. చాలావరకు జానీ పూటుగా మద్యం సేవించి, ఆ మత్తులోనే ఉండేవాడని చెప్పింది. అతడు కొకైన్‌, గంజాయి, హాలూసినోజెనిక్‌ వంటి డ్రగ్స్‌ సేవించడం తాను కళ్లారా చూశానని చెప్పుకొచ్చింది. అయితే మందు, లేదంటే సిగరెట్‌ తాగేవాడని, అందరి మీదా అరుస్తాడని, ఓసారి తనమీదకు మందు బాటిల్‌ విసిరాడని ఆరోపణలు చేసింది. కాగా అంబర్‌ హెరాల్డ్‌, జానీ డెప్‌ ఒకరి మీద ఒకరు వేసుకున్న పరువు నష్టం కేసులో ఫైనల్‌గా జానీ డెప్‌ గెలిచిన విషయం తెలిసిందే!

చదవండి: భర్తను టార్చర్‌ పెట్టిన హీరోయిన్‌, ట్రెండింగ్‌లో బాయ్‌కాట్‌ ఆలియా..
తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుని ఎమోషనలైన కల్యాణ్‌ రామ్‌

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)