Breaking News

అదరగొడుతున్న సూపర్‌ సోల్జర్‌.. 'ఎటాక్‌' రెండో ట్రైలర్‌ రిలీజ్

Published on Tue, 03/22/2022 - 14:56

John Abraham Attack Part 1 Movie Second Trailer Release: ఇప్పటివరకూ దేశాన్ని కాపాడేందుకు సైనికులు చేసిన సాహసాలు చూశాం. దుష్ట శక్తులతో పోరాడి కష్టాల్లో ఉన్న వారిని రక్షించిన సూపర్‌ హీరోలను వీక్షించాం. ఇప్పుడు ఒక కొత్త సూపర్‌ సోల్జర్‌ను చూడబోతున్నాం. అటు సూపర్‌ హీరోల అద్భుత శక్తి, ఇటు సైనికుల దేశభక్తిని పుణికిపుచ్చుకుని వస్తున్నాడు ఈ సూపర్‌ సోల్జర్‌. అతనెవరో కాదు బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హంక్‌ జాన్ అబ్రహం. 'సత్యమేవ జయతే 2' సినిమా తర్వాత జాన్‌ అబ్రహం నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'ఎటాక్‌: పార్ట్‌ 1'. ఉగ్రవాదులను ఏరిపారేసే తొలి సూపర్‌ సోల్జర్‌గా కనిపించనున్నాడు జాన్ అబ్రహం. ఇది వరకు ఈ సినిమా మొదటి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఆ ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంగళవారం (మార్చి 22) ఈ మూవీ రెండో ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. 

మొదటి ట్రైలర్‌లానే ఈ ట్రైలర్ అదిరిపోయింది. బీజీఎం, యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఒక సోల్జర్‌కు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ను అమర్చి, దేశ భద్రతను కాపాడలనే సరికొత్త కథతో ఈ సినిమా రూపొందింది. సైన్స్‌ ఫిక్షన్‌, హై ఆక్టేన్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర‍్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్ సింగ్‌, ప్రకాష్‌ రాజ్‌, రత్న పాఠక్‌ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ  సినిమాకు లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్‌ మూవీని ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నారు. 

Videos

అందాల యుద్ధం

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడి ఉపనయన వేడుక

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ తో కాదు.. సుకుమార్ తోనే ..

అల్లు అర్జున్ లేకుండా ఆర్య 3

చంద్రబాబుకు విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు

వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా

స్కాంలకు పరాకాష్ట అమరావతి పేరుతో దోపిడీనే : వైఎస్ జగన్

ఈనాడు టాయిలెట్ పేపర్ కి ఎక్కువ.. టిష్యూ పేపర్ కి తక్కువ..

చంద్రబాబు అప్పుల చిట్టా.. ఆధారాలతో బయటపెట్టిన వైఎస్ జగన్

మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితో కాదు..!

Photos

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)