Breaking News

బాలీవుడ్‌లో దక్షిణాది సినిమాల హవా.. అసలేం జరుగుతోందన్న జావేద్ అక్తర్‌

Published on Tue, 03/11/2025 - 15:44

బాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ సంచలన కామెంట్స్ చేశారు. హిందీ సినిమాల్లో ఏ మాత్రం కొత్తదనం కనిపించడం లేదని అన్నారు. తాజాగా ఓ డిబేట్‌కు హాజరైన ఆయన అమీర్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఇండస్ట్రీపై మాట్లాడారు. హిందీ సినిమాల్లో నాణ్యత రోజు రోజుకు పూర్తిగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులతో అన్ని సంబంధాలను కోల్పోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా దక్షిణాది నుంచి వస్తున్న సినిమాలు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నాయని జావేద్ అక్తర్ తెలిపారు. కనీసం ప్రేక్షకులకు తెలియని నటులతో తీసిన దక్షిణ భారత చిత్రాలు హిందీలో విడుదలై  రూ. 600 నుంచి 700 కోట్ల వ్యాపారం చేస్తున్నాయని వెల్లడించారు. చివరికి మన సినిమాలను సైతం సౌత్ డైరెక్టర్స్ తీస్తున్నారని పేర్కొన్నారు. అసలు బాలీవుడ్‌కు ఏమైంది? అని జావేద్ అక్తర్ ప్రశ్నించారు.

అయితే జావేద్ అక్తర్‌ కామెంట్స్‌పై ఇదే డిబేట్‌లో పాల్గొన్న అమిర్ ఖాన్ స్పందించారు. ఇక్కడ సమస్య ఉత్తరాది, దక్షిణాది కాదని అన్నారు. మనం ఎదుర్కొంటున్న సమస్య వేరే విషయమని తెలిపారు. దయచేసి మా సినిమాని చూడండి అని ప్రేక్షకులను అభ్యర్థించే ఏకైక ఇండస్ట్రీ మనదే.. లేదంటే ఎనిమిది వారాల్లో మీ ఇంట్లోనే ఓటీటీలో చూసే అవకాశం కల్పిస్తాం.. ఇదే బాలీవుడ్ బిజినెస్ మోడల్‌ అని అమీర్ ఖాన్ అన్నారు. ఓటీటీకి ఒకసారి సబ్‌స్క్రిప్షన్‌ చెల్లిస్తే చాలు సినిమాను ఎన్నిసార్లైనా వీక్షించవచ్చని తెలిపారు. ఒకే ఉత్పత్తిని రెండుసార్లు ఎలా అమ్మాలో నాకు తెలియదంటూ మాట్లాడారు. గతంలో ఓటీటీలు లేకపోవడం వల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చేసేవాళ్లమని.. కానీ ఇప్పుడు మనం ఎక్కడైనా సినిమాలు చూడవచ్చని తెలిపారు. ఇప్పుడు థియేటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు.. మన సొంత వ్యాపార నమూనాతో మన సినిమాలను చంపుకుంటున్నామని అమిర్ ఖాన్ అన్నారు.

హిందీ సినిమా రచయితలు, దర్శకులు ఒత్తిడికి గురికాకుండా కంటెంట్‌పై దృష్టి పెట్టాలని అమిర్‌ ఖాన్ సూచించారు. వారు తమ మూలాలను, ప్రాథమిక భావోద్వేగాలను మరచిపోయారని అన్నారు. నాలో నుంచి వచ్చేదాన్ని మాత్రమే నేను చేయగలను.. అది హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అని నేను ఆలోచించనని అమీర్ అన్నారు. కాగా.. ఇటీవల హన్సల్ మెహతా, వివేక్ అగ్నిహోత్రి కూడా హిందీ సినిమా ప్రస్తుత స్థితిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బాలీవుడ్ గ్రాఫ్ పడిపోతోందని అగ్నిహోత్రి వ్యాఖ్యానించగా.. హిందీ చిత్ర పరిశ్రమకు రీసెట్ అవసరమని మెహతా మాట్లాడారు.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)