Breaking News

ఇంట్లోంచి బయటకు వచ్చేసినప్పుడే అనుకున్నా.. దత్తత తీసుకోవాలని!

Published on Thu, 08/21/2025 - 16:21

35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉంది బుల్లితెర నటి జాస్మిన్‌ భాసిన్‌ (Jasmin Bhasin). పెళ్లి సంగతేమో కానీ కూతురు కావాలంటోందీ ముద్దుగుమ్మ. తప్పకుండా ఓ పాపను దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పింది. సోషల్‌ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన జాస్మిన్‌.. మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. అసలు పాపను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? అన్న అభిమాని ప్రశ్నకు ఇలా స్పందించింది.

అందుకే దత్తత ఆలోచన
నేను ఇల్లు వదిలి వచ్చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడే అనుకున్నా.. నాకంటూ మంచి జీవితం సంపాదించుకున్నప్పుడు కచ్చితంగా మరొకరికి లైఫ్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేను. 

అలాంటి పెళ్లయితే చేసుకోను
ఒకవేళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోయినా పర్వాలేదు. మంచి మనిషి దొరికితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే ఏదో ఒకర్ని మ్యారేజ్‌ చేసుకుని తర్వాత విడిపోవాల్సి రావడం నాకైతే ఇష్టం లేదు. ఇకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకుని తనకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని తెలిపింది. దిల్‌సే దిల్‌ తక్‌, నాగిన్‌ 4 వంటి సీరియల్స్‌తో జాస్మిన్‌కు పాపులారిటీ వచ్చింది. అర్ధ సర్బత్‌ దే భలే దీ, వార్నింగ్‌ 2, బద్నాం వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. ద ట్రేటర్స్‌ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.

చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)