Breaking News

ఎన్టీఆర్‌ కోసం జపాన్‌ నుంచి వచ్చిన అభిమాని.. వీడియో వైరల్‌

Published on Wed, 08/20/2025 - 10:08

జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరు చెబితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు కాలర్‌ ఎగరేస్తారు.. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్స్‌ ఉన్నారు. జపాన్‌లో ఎన్టీఆర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి భారత సినీ ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయింది. ఏకంగా ఆయన పేరుతో అక్కడ ఫ్యాన్స్‌  అసోసియేషన్స్ ఏర్పాటు అయ్యాయి అంటే ఎవరికైనా అర్థం అయిపోతుంది. తారక్‌ నటించిన పలు సినిమాల్లోని పాటలకు జపాన్‌లోని హీరో మునిరు, అశాహి ససాకీలతో పాటు అభిమానులు డ్యాన్సులు చేశారు. వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. అయితే, ఇప్పుడు వార్‌2 సినిమా చూసేందుకు జపాన్‌ నుంచి తారక్‌ అభిమాని ఇండియాకు వచ్చింది. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

జపాన్‌కు చెందిన 'క్రిసో' వార్‌2 చిత్రాన్ని చూసేందుకు భారత్‌ వచ్చింది. ఢిల్లీ ఎయిపోర్ట్‌లో తారక్‌ ఫోటోతో ఉన్న టీ షర్ట్‌ ధరించి ఆమె కనిపించింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్‌  ఆమెను పలకరించారు. ఇండియా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే.. ఆమె ఇలా చెప్పింది. ' నేను ఎన్టీఆర్‌కు చాలా పెద్ద అభిమానిని, ఆయన సినిమా చూసేందుకే ఇండియా వచ్చాను.  ఆయన నటించిన సినిమా ఏదైనా సరే భారత్‌లో చూడాలని ఇక్కడికి వస్తుంటాను. గతంలో కూడా వచ్చాను.' అని పంచుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఆయన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్‌కి అక్కడి ప్రేక్షకులు బాగా ఆకర్షితులవుతున్నారు. ‘బాద్‌షా’ సినిమాకే జపాన్‌లో ఫ్యాన్స్ ఉండగా.. ‘ఆర్ఆర్ఆర్’తో ఆయనకు గ్లోబల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. దేవర సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్‌ కూడా జపాన్‌ వెళ్లి తన అభిమానులను కలుసుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)