Breaking News

పోలీసులకు జానీ మాస్టర్ భార్య ఫిర్యాదు

Published on Wed, 09/23/2026 - 18:29

కొరియోగ్రాఫర్ జానీమాస్టర్‌ భార్య సుమలత పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు డ్యాన్సర్లు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ బంజారాహిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘు మాస్టర్ తరఫున లేడీ డాన్సర్స్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొంది. అయితే మినిట్స్ బుక్ విషయంలో  గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. సుమలత దౌర్జన్యంగా మినిట్స్ బుక్ లాక్కోవడంతో అడ్డుకున్నామని రఘు మాస్టర్ వర్గం లేడీ డాన్సర్స్ చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

కాగా.. ఇవాళ ఫిల్మ్ ఫెడరేషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. సుమలత కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసింది. ఆమెకు మెజారిటీ డ్యాన్సర్స్ మద్దతు లేకపోవడంతో సుమలత వర్గాన్ని తొలగించారు. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా సుమలత తన పదవిని కోల్పోయింది. ఈ నిర్ణయంతో మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

సుమలత, రఘు మాస్టర్ సభ్యులతో ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశమైంది. ఈ మీటింగ్‌కు మొత్తం 225 మంది డాన్సర్స్ హాజరయ్యారు. ఈ భేటీలో సుమలతకు కేవలం 11 మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు ప్రకటించడంతో సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల అక్టోబర్‌ 11న డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని సమావేశంలో వెల్లడించారు. 

Videos

ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...

క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

అయ్య‌ప్ప మాల సాక్షిగా చెబుతున్నా... వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి కొట్టుకుపోవ‌డం ప‌క్కా

CJP మరో డిమాండ్ CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందే

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి రంగం సిద్ధం.

స్టాక్ మార్కెట్ భారీ పతనం! ₹6 లక్షల కోట్లు ఆవిరి!

టీచర్లు అంటూ యువగళం టీమ్ బూతులు.. అనిత వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన పుష్ప శ్రీ వాణి

బండ బూతులు తిడుతూ..ఎలా కొట్టించిందంటే?

కొట్టుకుపోయిన కోస్తా.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

Photos

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డులో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు (ఫొటోలు)

+5

ఏష నాగుల కట్ట మీద.. వ‌ర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన కీర్తి సురేష్‌..(ఫొటోలు)

+5

ఏపీ : తీవ్ర వాయుగుండం...ఉత్తరాంధ్ర అతలాకుతలం (ఫొటోలు)

+5

వేడుకకు వేళాయే...రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర (ఫొటోలు)