Breaking News

అమ్మ బ్లాక్‌బస్టర్ చిత్రంలో జాన్వీకపూర్‌.. ఆమె ఏమన్నారంటే?

Published on Fri, 07/26/2024 - 15:41

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం ఉలజ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ‍ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్‌కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 1987లో వచ్చి శ్రీదేవి బ్లాక్‌బస్టర్‌ మూవీ మిస్టర్ ఇండియాకు సీక్వెల్‌ తీస్తే అందులో నటిస్తారా? అని ఆమెను అడిగారు. ఈ ప్రశ్నకు జాన్వీ కపూర్ సమాధానమిచ్చింది. మిస్టర్ ఇండియా చ్తిరంలో అనిల్ కపూర్‌, శ్రీదేవి జంటగా నటించారు.

జాన్వీ మాట్లాడుతూ.. "ఇండియన్ సినిమాల్లో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో మిస్టర్ ఇండియా ఒకటి. అలాంటి సినిమా మళ్లీ రీమేక్ చేస్తారా లేదా అనేది నాకు తెలియదు. దాని కోసం నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు. ఆ సినిమా చేయాలా? వద్దా? అనేది నిర్మాతలకు బాగా తెలుసు అని నేను అనుకుంటున్నా. 
ఈ విషయం డైరెక్టర్ ఎవరో వారికే బాగా తెలుస్తుంది' అని తెలిపింది.

తన తండ్రి బోనీ కపూర్ గురించి మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ ఆయన సినిమాలో ఇష్టం లేదని చెప్పలేదు. ఆయన తీర్పును ఎక్కువగా విశ్వసిస్తా. నేను దానిని తిరస్కరించలేను. నన్ను తన సినిమాలో తీసుకోమని నేనేప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఆయన కుమార్తెగా ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. నాన్నకు నచ్చిన విధంగా పనిచేయాలని నేను కోరుకుంటా. అంతేకానీ దయచేసి నన్ను మీ సినిమాలోకి తీసుకోండి అని వేడుకోను' అని పేర్కొంది.

సీక్వెల్‌పై బోనీ కపూర్
కాగా.. గతేడాది అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన మిస్టర్ ఇండియా చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌పై హింట్‌ ఇచ్చాడు. దీనికోసం వర్క్ జరుగుతోంది.. త్వరలోనే ప్రకటిస్తాం అని పోస్ట్ చేశారు. కానీ ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు. కాగా..1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమాకు శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు. నర్సింహా ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై బోనీ కపూర్, సురీందర్ కపూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అన్నూ కపూర్, అజిత్ వచాని, హరీష్ పటేల్, దివంగత సతీష్ కౌశిక్, అహ్మద్ ఖాన్, అఫ్తాబ్ శివదాసాని తదితరులు నటించారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)