Breaking News

జైలర్‌-2లో ఐటమ్ సాంగ్.. తమన్నా క్రేజ్ వస్తుందా?

Published on Wed, 10/14/2026 - 08:29

ప్రస్తుతం సినిమాల్లో ప్రత్యేక పాటలు చిత్రాలకు ఓ ట్రెండ్‌గా మారాయనే  చెప్పాలి. ఈ తరహా పాటలు యూత్‌ను బాగా ఎట్రాక్ట్‌ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా స్టార్‌ హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాటలు ట్రెండింగ్‌గా మారుతున్నాయనే చెప్పాలి. రజినీకాంత్‌ హీరోగా నటించిన జైలర్‌ చిత్రంలో నటి తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా సాంగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పాటలో మిల్కీ బ్యూటీ డ్యాన్స్‌తో అదరగొట్టింది.

తాజాగా రజనీకాంత్‌ నటించిన జైలర్‌ 2 చిత్రం లో కూడా రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ఇందులో ఒక పాటలో నటి పూర్ణ నటించారు. ఈ పాటను ఇటీవల విడుదల చేశారు. పాట బాగున్నా అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్‌ రాలేదు. అయితే ఇటీవల మరో ప్రత్యేక పాటను విడుదల చేశారు. దీన్ని పక్కా మాస్‌ మసాలా సాంగే అనాలి. ఇందులో కెనడాకు చెందిన  నటి, మోడల్, డాన్సర్‌ గ్లామర్‌ డాల్‌ నోరా ఫతేరి నటించారు.

గతంలో ఈ బాలీవుడ్ బ్యూటీ తమిళం, తెలుగు,మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో, పాత్రల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు చిత్రం బాహుబలి– 1లో మనోహరి అనే పాటలో మరో ముగ్గురు భామలతో కలిసి నటించి బాగా గుర్తింపు పొందారు. కాగా తాజాగా జైలర్‌ 2 చిత్రంలో నటించిన బిందాస్‌ అనే పాటలో నోరా ఫతేరి అనే పాట యూట్యూబ్‌ ఛానళ్లలో హల్‌ చల్‌ చేస్తోంది. జైలర్‌ చిత్రంలో తమన్నా ఎలాగైతే అందాల మోత మోగించారో, అదేవిధంగా ఇప్పుడు నటి నోరా ఫతేరి కూడా ఏ మాత్రం ఒళ్లు దాచుకోకుండా బిందాస్‌ పాటలో నటించారు.అయితే జైలర్‌ చిత్రంలోని తమన్నా నటించిన నువ్వు కావాలయ్యా పాటను ఈ బిందాస్‌ పాట బీట్‌ చేస్తుందా ? లేదా అనేది మూవీ రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. 
 

Videos

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

బుద్ధిలేని గేమ్.. హౌస్ లో మరో బిగ్ ట్విస్ట్

ఏపీ లోకల్ ఫెట్ మూడు దశల్లో మున్సిపల్ ఎన్నికలు

Photos

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)

+5

రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. విరోష్ జంట క్యూట్‌ మూమెంట్స్ (ఫోటోలు)

+5

'ఆలియాస్ రుక్మిణీ'గా ఆఫియా సయ్యద్.. ఈమె ఎవరంటే? (ఫొటోలు)

+5

‘గరివిడి లక్ష్మి’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)