ఇలాంటి ఏలక్షన్ లు నెవ్వర్ బిఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్...
Breaking News
ఓటీటీలోకి జైలర్2.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. అధికారిక ప్రకటన
Published on Thu, 11/05/2026 - 14:28
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్ మూవీ జైలర్-2. గతంలో రిలీజైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. దసరా కానుకగా గత నెల 15న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇప్పటికే రూ.800 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది.
నవంబర్ 12 నుంచి
అయితే ఈ మూవీ మరోసారి ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు ప్రైమ్ వీడియో ఈ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. మిథున్ చక్రవర్తి, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ తదితరులు ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.
కథేంటంటే..
విగ్రహాల అక్రమ వ్యాపారం చేస్తున్న వర్మ(వినాయకన్)ని, అతనితో చేతులు కలిపిన కొడుకు ఏసీపీ అర్జున్(వసంత్ రవి) ని రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్) తుది ముట్టించడంతో ‘జైలర్’ సినిమా ముగుస్తుంది. జైలర్ 2 కథ అక్కడ నుంచి ప్రారంభం అవుతుంది. తన కొడుకు చావుకు కారణం అయిన వర్మ వెనుక ఉన్న బాస్ ఎవరో తెలుసుకోవాలని ముత్తువేల్ పాండ్యన్ ప్రయత్నిస్తుంటాడు. ఇందులో భాగంగానే లోకల్ రౌడీ మూర్తి దగ్గర డ్రైవర్‌గా చేరి.. అతని ద్వారా దిలీప్ (సురాజ్ వెంజారమూడు)ని కలుస్తాడు. దిలీప్ ద్వారా వర్మ బాస్ బోధి (ఎస్.జె. సూర్య) గురించి తెలుసుకోవాలనుకుంటాడు. మరి ఆ ప్రయత్నం ఫలించిందా? బోధి అక్రమ వ్యాపారాలను మత్తువేల్ పాండ్యన్ ఎలా కూల్చాడు? ఈ క్రమంలో తన స్నేహితులు మాథ్యూ(మోహన్ లాల్), నరసింహా(శివరాజ్ కుమార్), రోలీ(హృతిక్ రోషన్), కామదేవ్(జాకీ ష్రాప్) ఎలాంటి సహాయం చేశారు? ఈ కథలో చక్రి కల్పక్ (మిథున్ చక్రవర్తి), కాంత కల్పక్(విద్యాబాలన్) పాత్రలు ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
(ఇదీ చదవండి: ‘రామాయణం’ మూవీ రివ్యూ)
Tags : 1