‘జైలర్‌ 2’ ఫస్ట్‌ రివ్యూ.. రజనీకాంత్‌ ఖాతాలో హిట్‌ పడినట్లేనా?

Published on Wed, 10/14/2026 - 15:57

రజనీకాంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్‌ 2’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, ఎస్‌జే సూర్య, విద్యాబాలన్‌, మిథన్‌ చక్రవర్తి, మిర్నా కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు హృతిక్‌ రోషన్‌, విజయ్‌ సేతుపతిల గెస్ట్‌ గెస్ట్ అప్పియరెన్స్ ఉందట. అనిరుధ్‌ సంగీతం అందించాడు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘జైలర్‌’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన జైలర్‌ 2..అక్టోబర్‌ 15న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని దేశాల్లోనూ ఈ చిత్రానికి సెన్సార్‌ పూర్తయింది. 

ఇండియాలో ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది. సినిమ నిడివి 2 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిసింది. రక్తపాతం ఎక్కువ ఉన్న కొన్ని సీన్లను తొలగించడంతో అభ్యంతరకర డైలాగలను మ్యూట్‌ చేయాలని ఆదేశించారు. ఒకటి రెండు సీన్లు తప్పితే పెద్దగా అభ్యంతరం చెప్పకుండానే సెన్సార్‌ సభ్యులు ఈ సినిమాకు అనుమతి ఇచ్చారట.

(చదవండి: విరోష్ జంట గొప్ప నిర్ణయం.. ఏకంగా 400 కుటుంబాలకు..!)

ఈ మూవీ ప్రివ్యూ షో రీసెంట్ గా లండన్ లో ప్రదర్శించారట.దీంతో ఈ సినిమా కథ, కథనాలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కథ విషయానికొస్తే..కొడుకు మరణం తర్వాత రిటైర్డ్ జైలర్ ముత్తువేల్ పాండ్యన్ (రజనీకాంత్) భార్య విజయ పాండియన్‌(రమ్యకృష్ణ), కోడలు శ్వేతా పాండియన్‌(మిర్నా), మనవడు రిత్విక్‌(రిత్విక్‌)లకు ఎలాంటి అపాయం కలగకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో డ్రగ్స్‌ మాఫియా డాన్‌ (మిథున్‌ చక్రవర్తి), , ఆయన కుమారుడు బోధి కల్పక్ (ఎస్‌జే సూర్య), ఆయన కోడలు కాంతా కల్పక్ (విద్యాబాలన్) నుంచి తన కుటుంబానికి ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఆ సమయంలో ముత్తువేల్ పాండ్యన్, ఆయన స్నేహితులు మ్యాథ్యూ (మోహన్ లాల్), నరసింహా (శివ రాజ్ కుమార్), కామదేవ్ (జాకీ ష్రాఫ్), హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి సహాయంతో ఎలా వారి ఆట కట్టించాడు అనేది ఈ సినిమా కథ.

(చదవండి: ప్రభాస్ గిఫ్ట్ ఇచ్చాడంటే ఇలానే ఉంటుంది)

ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిన టాక్‌ ప్రకారం.. ఫస్టాఫ్‌ రజనీకాంత్‌ మాస్‌ ఎలివేషన్లతో పాటు దిలీప్ కుమార్ మార్కు కామెడీతో సాగుతుదంట. ఎక్కడ బోర్‌ కొట్టించకుండా గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో నడిపించినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అదిరిపోయిందట. సెకండాఫ్‌లో వరుస సర్‌ప్రైజ్‌లతో కథనం పరుగులు పెట్టిస్తుందట.  క్లైమాక్స్‌లో హృతిక్‌ రోషన్‌తో వచ్చే సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయట. అనిరుధ్‌ నేపథ్య సంగీతం కూడా బాగుందట.

మరోవైపు ఈ సినిమాపై నెగెటివ్‌ టాక్‌ కూడా వినిపిస్తుంది. జైలర్‌ మాదిరి ఈ సీక్వెల్‌ ఆకట్టుకోలేదని..ట్విస్టులు కూడా ఈజీగా పసిగట్టేలా ఉన్నాయని చెబుతున్నారు. స్టార్‌ క్యాస్ట్‌ని సరిగా వాడుకోలేకపోయారనే, రజనీకాంత్‌ నిలబడి యాక్షన్‌ చేయించాడే తప్ప.. ఆయన చేసిందేమి లేదనే నెగెటివ్‌ టాక్‌ కూడా వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. 

Videos

భగ్గుమన్న తెనాలి.. మున్సిపల్ సీటు కోసం కొట్లాట

భర్తను చంపి బ్లూ డ్రమ్ లో మృతదేహం.. ముస్కాన్, సాహిల్ కు ఉరిశిక్ష!

నారా సేవలో పవన్.. జనసేనకు బిగ్ షాక్.. మున్సిపల్ ఎన్నికల్లో ముష్టి..

ఇండియా VS వెస్టిండీస్.... ఉప్పల్ కు పోటెత్తిన ఫ్యాన్స్!

YSRCP నేత ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకల్లో YS జగన్

అన్ని పోలింగ్ స్టేషన్స్ లో CCTV పెట్టలేం... క్లారిటీ ఇచ్చిన AP ఎలక్షన్ కమీషనర్

సాయి పల్లవి 2.0 కల్కితో స్టార్ట్...

జగన్ కేసులపై బ్రేకింగ్ న్యూస్ లా ఎల్లో మీడియా విష ప్రచారం

సమరానికి సై... ఓట్ల తొలగింపు.. SIRపై SEC ఏమన్నారంటే!

OpenAI రహస్య కుట్ర.. ఇంజినీర్ పైనే అనుమానాలు?

Photos

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)

+5

వియత్నాం ట్రిప్ ఫుల్‌గా ఎంజాయ్ చేసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత ఫొటోషూట్ (ఫొటోలు)

+5

డోంట్ స్లీప్ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల డ్రస్‌లో శ్రీముఖి.. ‍గ్లామర్ రచ్చ (ఫొటోలు)

+5

'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

లైట్ కలర్ శారీలో అనసూయ గ్లామర్.. (ఫోటోలు)

+5

తిరుమల : సింహ వాహనంపై శ్రీ మలయప్పస్వామివారు దర్శనం (ఫొటోలు)