Breaking News

జగదేకవీరుడు.. అతిలోకసుందరి.. అప్పట్లోనే రూ.210 రూపాయలా!

Published on Sun, 05/04/2025 - 15:58

చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. ఈ సినిమా మరోసారి అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత బిగ్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై తెలుగు సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత మేకర్స్ రీ రిలీజ్‌ చేయనున్నారు.

ఈ సినిమాను 2డీతో పాటు 3డీ వర్షన్‌లోనూ అందుబాటులోకి తీసుకు రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం అప్పట్లోనే విజువల్‌ వండర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వర్షన్‌తో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతమందించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు జగదేకవీరుడు కథ ఎలా మొదలైందనే విషయాలతో పాటు మూవీ గురించి వివరిస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ఓపెనవ్వగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే జగదేకవీరుడు.. అతిలోకసుందరి మూవీ టికెట్లకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని వైజయంతి మూవీస్ పంచుకుంది.

ఈ మూవీ రిలీజైన రోజుల్లో అంటే 1990ల్లో ఒక్క టికెట్‌ కేవలం రూ.6.50 గా ఉండేది. కానీ ఈ మూవీకి విపరీతమైన ‍క్రేజ్ రావడంతో విజయవాడలో మాట్నీ షోలకు ఏకంగా రూ.210 కి బ్లాక్‌లో అమ్మారట. అప్పట్లో 210 రూపాయలు అంటే ఈ రోజు పోలిస్తే రెండు వేలకు పైమాటే. దాదాపు 35 ఏళ్ల క్రితమే ఆ రేంజ్‌లో టికెట్స్ అమ్మారంటే ఈ మూవీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకేందుకు ఆలస్యం బిగ్‌ స్క్రీన్‌పై చూసి మరోసారి ఎంజాయ్ చేయండి.
 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)