Breaking News

రూ.100 కోట్లు ఇచ్చినా సరే తనతో పని చేయను

Published on Sat, 10/11/2025 - 13:30

రూ.100 కోట్లు ఇచ్చినా సరే ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇస్మాయిల్‌ దర్బార్‌ (Ismail Darbar). వీరిద్దరూ 'హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌', 'దేవదాస్‌' సినిమాలకు కలిసి వర్క్‌ చేశారు. ఈ రెండు చిత్రాల ఘన విజయంలో ఇస్మాయిల్‌ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. కలిసి బ్లాక్‌బస్టర్లు కొట్టిన వీళ్లిద్దరి మధ్య తర్వాత పెద్ద అగాధమే ఏర్పడింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్‌ మాట్లాడాడు.

భయమెందుకు?
'హీరామండి ప్రాజెక్ట్‌ ఈ మధ్య అనుకుంది కాదు. రెండున్నర దశాబ్దాల కిందటే ఆ ప్రాజెక్ట్‌కు పునాది పడింది. ఆ సమయంలో ఓ వార్తాపత్రికలో హీరామండి ప్రాజెక్ట్‌కు నేను అందించే సంగీతమే వెన్నెముకలా నిలవనుంది అని రాశారు. ఇది నేనే పత్రికలో వేయించానని సంజయ్‌ అనుమానించాడు. పిలిచి నిలదీశాడు. నిజంగా నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే నీకు భయపడాల్సిన అవసరమే లేదు. నీ ముందు కూడా అదే చెప్తాను. అయినా పేపర్‌లో అది ఎవరు రాశారో నాకసలు తెలీనే తెలియదు అని చెప్పాను.

నేనే బ్యాక్‌బోన్‌
సరే, వదిలెయ్‌ అని అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వదిలెయ్‌ అన్నది ఈ విషయాన్ని కాదు, ప్రాజెక్ట్‌ అని నాకు తర్వాత అర్థమైంది. తనతో చెప్పించుకోవడం దేనికని నేనే ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నా! తర్వాత.. హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌, దేవదాస్‌ సినిమాలకు నేనే వెన్నెముక అని సంజయ్‌ పీఆర్‌ టీమ్‌కు కూడా తెలిసొచ్చింది. కానీ సంజయ్‌కు ఇగో ఎక్కువ. నా కష్టానికి కూడా తనే క్రెడిట్‌ తీసుకుంటాడు. అందుకే తనతో పనిచేయకూడదనుకున్నాను. తను రూ.100 కోట్లు ఇచ్చినా సరే ఆయన సినిమాకు పని చేయను' అని ఇస్మాయిల్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్‌

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)