Breaking News

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు

Published on Sat, 09/19/2026 - 08:26

మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘ఇరుముడి’ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సినిమా మిస్‌ అయినవారు ఇంటి వద్దే చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు.  ఈమేరకు సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేస్తుండడంతో వైరల్‌గా మారుతున్నాయి.
ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు.. 
ముఖ్యంగా పల్లెల్లో ‘ఇరుముడి’ని ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. వీధుల్లో పెద్ద స్క్రీన్లు పెట్టి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సినిమాను చూస్తున్న వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా కొన్ని గ్రామాల్లో వెండి తెరపై సినిమాను ప్రదర్శించడం విశేషంగా మారింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులు ఇలా తమ గ్రామాల్లోనే సినిమాను చూసే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘ఇరుముడి’ ఓటీటీలోనే జోరు చూపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రామల్లో  ప్రదర్శనల వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

200 కోట్లకు పైగా కలెక్షన్లు
కాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో విశేషాదరణ దక్కించుకుంది. దీంతో బాక్సాఫీసులో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.  ఇప్పుడీ చిత్రం సెప్టెంబరు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 
ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ తొలి కెప్టన్‌ రైతు బిడ్డ.. లక్ష నజరానా 
 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)