Breaking News

ఛావాను దాటేసిన చిన్న మూవీ.. ఏకంగా 1200% లాభాలు!

Published on Fri, 07/18/2025 - 16:28

చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా.. కంటెంట్‌ నచ్చితేనే థియేటర్‌కు వస్తామని ప్రేక్షకులు ఘంటాపథంగా చెప్తున్నారు. కథ బాలేదంటే భారీ బడ్జెట్‌ మూవీ అయినా సరే మాకు అక్కర్లేదంటూ ముఖం చాటేస్తున్నారు. అలా కంగువా, థగ్‌ లైఫ్‌, ఇండియన్‌ 2, గేమ్‌ ఛేంజర్‌.. ఇలా ఎన్నో సినిమాలు బోల్తా కొట్టాయి.

1200% లాభాలు
అయితే ఓ చిన్న చిత్రం మాత్రం బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ చేసింది. ఏకంగా 1200% లాభాలను తెచ్చిపెట్టింది. ఆ మూవీయే టూరిస్ట్‌ ఫ్యామిలీ (Tourist Family Movie). ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక లాభాలు గడించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం రూ.7 కోట్లతో నిర్మించిన ఈ తమిళ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లు వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఐదు వారాల్లోనే..
టూరిస్ట్‌ ఫ్యామిలీ మూవీలో శశికుమార్‌, సిమ్రాన్‌, మిథున్‌ జై శంకర్‌, కమలేశ్‌ జగన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిషన్‌ జీవింత్‌ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్‌ 29న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. మొదటివారం కేవలం రూ.23 కోట్లు మాత్రమే రాగా.. మౌత్‌ టాక్‌ వల్ల రెండో వారం రూ.29 కోట్లు వచ్చాయి. ఐదు వారాలు తిరిగేసరికి ఏకంగా రూ.90 కోట్లు వసూలు చేసింది.

ఛావాను వెనక్కు నెట్టి
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో విక్కీ కౌశల్‌ 'ఛావా' ముందు వరుసలో ఉంది. రూ.90 కోట్లతో రూపొందిన ఈ మూవీ 800 % లాభాలతో రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సొంతం చేసుకుంది. అయితే పర్సంటేజీ లెక్కన చూస్తే.. టూరిస్ట్‌ ఫ్యామిలీ ఛావాను వెనక్కు నెట్టి 1200% లాభాలను గడించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. టూరిస్ట్‌ ఫ్యామిలీ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉండగా.. ఛావా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోంది.

చదవండి: పుట్టెడు దుఃఖం, డిప్రెషన్‌.. అక్క కోసం ఇండియాకు వచ్చేశా: శిల్ప శిరోద్కర్‌

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)