Breaking News

టాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు

Published on Thu, 01/23/2025 - 10:48

సాక్షి, హైదరాబాద్‌: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్‌ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌, నిర్మాత నెక్కింటి శ్రీదర్‌, దిల్‌ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నివాసాల్లో, మైత్రీ మూవీస్‌ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.

టాలీవుడ్‌పై టార్గెట్‌
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నివాసాల్లో, మైత్రీ మూవీస్‌ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్‌ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.

బుధవారం నాడు సుకుమార్‌ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్‌ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ  వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.

మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)