Breaking News

2025లో టాప్‌ సినిమా ఏదో తెలుసా? 500% లాభాలు తెచ్చిపెట్టిన మూవీ

Published on Wed, 07/09/2025 - 16:37

కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్‌లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్‌ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్‌డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్‌- మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ చిత్రాల జాబితాను రిలీజ్‌ చేసింది.

ఫస్టాఫ్‌లో టాప్‌ 10
2025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్‌ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్‌ 10లో అత్యధికంగా బాలీవుడ్‌ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్‌ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

టాప్‌ 5లో ఏమున్నాయ్‌?
మరాఠా యోధుడు శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్‌ కుమార్‌ సింగ్‌ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్‌ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్‌ రెండో స్థానంలో ఉంది. 

కోలీవుడ్‌ నుంచి 3 సినిమాలు
బాక్సాఫీస్‌ వద్ద నిరాశపరిచిన షాహిద్‌ కపూర్‌ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్‌ దేవ్‌గణ్‌ రైడ్‌ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్‌, ఎల్‌ 2: ఎంపురాన్‌, సితారే జమీన్‌ పర్‌, కేసరి చాప్టర్‌ 2, విడాముయర్చి టాప్‌ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్‌ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్‌ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది.

 

 

చదవండి: సినిమాలు మానేసి సెలూన్‌లో పని చేశా.. 10th ఫెయిలైనా..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)