Breaking News

పాకిస్తాన్‌ సైన్యంలో ఫౌజీ హీరోయిన్‌ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి

Published on Thu, 04/24/2025 - 12:52

ప్రభాస్‌ ఫౌజీ సినిమా హీరోయిన్‌ ఇమాన్వి (Imanvi)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror attack) జరిగిన నేపథ్యంలో.. పాకిస్తాన్‌పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్‌ ఇమాన్వి కుటుంబానిది పాకిస్తాన్‌ నేపథ్యం అని ఓ వార్త వైరలవుతోంది. ఇమాన్వి తండ్రి గతంలో పాకిస్తాన్‌ మిలటరీలో పని చేశాడని.. వీళ్లది కరాచీ అని సదరు వార్త సారాంశం. చాలా మంది ఇదే నిజమని భ్రమపడి.. పాక్‌ అమ్మాయి అయిన ఇమాన్వీని ఫౌజీ నుంచి తీసేయాలని డిమాండ్‌ చేశారు.

తీవ్రంగా ఖండిస్తున్నా..
ఈ క్రమంలో సదరు వార్తలపై ఇమాన్వి క్లారిటీ ఇచ్చింది. "పహల్గామ్‌లో జరిగిన విషాద సంఘటన పట్ల నేను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నాను. నా కుటుంబంలో ఎవరికీ పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్ధాలు పుట్టించారు.

దుష్ప్రచారం
దీన్ని క్రాస్‌ చెక్‌ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు ఆ అబద్ధాలను వ్యాప్తి చేయడం బాధాకరం. నా పై దుష్ప్రచారం చేశారు. నేను భారతీయ మూలాలున్న అమెరికన్‌ వాసిని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలను. నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చారు. తర్వాత అమెరికా పౌరులుగా మారారు. నేను లాస్ ఏంజిల్స్.. కాలిఫోర్నియాలో జన్మించాను.

నా రక్తంలోనూ..
USAలో నా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను. సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది" అని ఇమాన్వి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది.

 

 

చదవండి: ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్‌.. మండిపడ్డ నెటిజన్స్‌!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)