Breaking News

నా మాటలు కొందరికి కడుపు మంటగా ఉన్నాయి: ఇళయరాజా

Published on Mon, 02/03/2025 - 07:35

సంగీత జ్ఞానిగా ఇళయరాజా(Ilayaraja) ఎంతో పేరు సాధించారు. ఆయన సంగీత ప్రయాణంలో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నారు. 1976లో అన్నకిలి అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఆ తర్వాత పలు భాషల్లో 1500 పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అదేవిధంగా 7 వేలకు పైగా పాటలు రాసిన ఘనత ఆయనదే.. ఇప్పటి తరం వారు కూడా ఆయన సంగీతానికి ఫిదా అవుతారు. మైమరిచి ఆయన పాటలు వింటారు. 35 రోజుల్లో సింపోనిని రూపొందించవచ్చని నిరూపించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. అయితే ఈయనపై వివాదాలు లేవని చెప్పలేం. 

ఇటీవల ఇళయరాజా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ... 'నేను సంగీతాన్ని అందించిన పలు పాటల ద్వారా వెస్ట్రన్‌ క్లాసికల్‌ సంగీతాన్ని పరిచయం చేసి మీకు నేర్పించాను. సంగీత దర్శకులు మొజార్ట్‌, పోతోవన్‌ బంటి పేర్లు మీకందరికీ ఎలా తెలుసు ? వారి గురించి మీకు చెప్పింది ఎవరు? నేనే వారిని మీకు పరిచయం చేశాను. ఒక సంగీత అభిమానికి పలు విధాలుగా ప్రపంచ సంగీతాన్ని నా పాటల ద్వారా పరిచయం చేశాను. నేను సింపోనిని రూపొందించాను. అంటే నాకు సంగీతం అంటే అంత ఆసక్తి అని మీరు తెలుసుకోవాలి. ఇలా అనడం కొందరికి కడుపు మంట కావచ్చు.అయితే నా సంగీతం అందరి జీవితాల్లోనూ ఉంటుంది. అలాగని మీరు అడగ్గానే సంగీతాన్ని అందిస్తే నేను శరవణ భవనం (హోటల్‌) అవుతాను. 

నా సంగీతాన్ని విని చిన్న బిడ్డ తిరిగి ప్రాణం పోసుకుంది. ఒక ఏనుగుల గుంపు నా పాటలు వినడానికి వచ్చాయి. ఇవన్నీ చెబితే నాకు గర్వం, పొగరు అంటారు. అయినా గర్వం నాకు గాక వేరే వారికి ఎందుకు వస్తుంది? నిజమే నాకు పొగరు ఎక్కువే. ప్రపంచంలోనే ఎవరు చేయలేని దానిని నేను చేశాను. అలాంటప్పుడు నాకేగా పొగరు ఉండాలి. ప్రతిభ ఉన్నవారికే గర్వం ఉంటుంది.'  అని ఇళయరాజా పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.
 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)