ఇఫీలో అమరన్‌ సినిమా

Published on Sun, 11/23/2025 - 06:51

గోవాలో జరుగుతున్న 56 ఇండియన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవ (IFFI–2025) వేడుకల్లో అమరన్‌ చిత్రం (Amaran Movie) ఇండియన్‌ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్‌ హీరో కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ, టెర్మరిక్‌ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్‌. శివకార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ పెరియస్వామి తెరకెక్కించారు. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్‌ చిత్ర యూనిట్‌కు గౌరవ మైలురాయి అయింది.

ఇఫీలో అమరన్‌
భారతీయ సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రశంసలు పొందిన చిత్రాలే ఇండియన్‌ పనోరమ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవుతాయి. అలా ఎంపికైన అమరన్‌ చిత్ర ప్రదర్శన శనివారం నాడు ఇండియన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలో ప్రదర్శించారు. కమల్‌ హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌, దర్శకుడు రాజకుమార్‌ పెరియస్వామి, శివకార్తికేయన్‌, సాయిపల్లవి వేడుకలో పాల్గొన్నారు.

మేజర్‌ ముకుంద్‌ జీవితకథ
అశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం అమరన్‌. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. మేజర్‌ ముకుంద్‌ దేశభక్తిని ,అత్యున్నత సేవలను ప్రదర్శించిన చిత్రం అమరన్‌. ఇందులో భారత సైనికుల వీరత్వాన్ని, ఘనతను ఆవిష్కరించారు. అలాంటి చిత్రం ఇండియన్‌ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆ చిత్ర యూనిట్‌ ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా అమరన్‌ చిత్రం అంతర్జాతీయ గోల్డెన్‌ పికాక్‌ చిత్రోత్సవాల్లో నామినేషన్‌కు పంపడం గమనార్హం.

చదవండి: ఒక్కరోజే ఇన్ని సినిమాలా?

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)