5 రోజుల్లో రూ.663 కోట్లు! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న రామాయణం
Breaking News
‘ఇడుపు కాయితం’ టీజర్ వచ్చేసింది..
Published on Thu, 11/12/2026 - 11:01
పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. ఇందులో ప్రియదర్శి సరసన నాగదుర్గ కథానాయికగా నటిస్తూ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ సినిమా డిసెంబరు 11న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం నుంచి ఈ రోజు( గురువారం) టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్, బన్నీ వాస్, తబితా సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి అందిస్తున్న సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బరాత్ బీట్’ పాటలు శ్రోతలను విపరీతంగా అలరించగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది.
(ఇదీ చదవండి: నాగార్జున రీల్ కాదు.. రియల్ హీరో: సీఎం రేవంత్‌రెడ్డి)
Tags : 1