Breaking News

పుష్పరాజ్‌.. తగ్గేదేలే.. అచ్చం బన్నీని తలపించావ్ భయ్యా!

Published on Wed, 11/13/2024 - 13:10

ఐకాన్  స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో పుష్ప పార్ట్‌-1 బన్నీ ఫ్యాన్స్‌ను ఓ రేంజ్‌లో అలరించింది. తగ్గదేలే అనే డైలాగ్‌ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ డైలాగ్‌ కేవలం ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చెప్పే ఉంటారు. అంతా ఫేమస్ అయిపోయాడు పుష్పరాజ్. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే ఏకంగా బన్నీ స్టైల్‌తో అభిమానలను అలరించారు.

ఇకపోతే ఐకాన్ స్టార్‌ ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. మరికొద్ది రోజుల్లోనే పుష్పరాజ్‌ థియేటర్లలో సందడి చేయనున్నారు. రిలీజ్‌కు ఇంకా కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే టీజర్‌, పోస్టర్లతో హోరెత్తించిన మేకర్స్.. మెగా ఈవెంట్‌ కోసం సిద్ధమయ్యారు. పుష్ప-2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను పట్నాలో భారీఎత్తున నిర్వహిస్తున్నారు. ఈనెల 17న భారీస్థాయిలో జరిగే ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.

ఇకపోతే బన్నీ ఫ్యాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో ఏహీరోకు లేని ఫ్యాన్‌బేస్‌ ఆయనకు మాత్రమే సొంతం. తాజాగా ఓ అభిమాని చేసిన మేకప్ స్టంట్‌ అదిరిపోయింది. అచ్చం అల్లు అర్జున్‌ను తలపించేలా పుష్ప-2 గెటప్‌లో కనిపించారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన కొరియోగ్రాఫర్ డీజే మధు చేసిన ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇది చూసిన నెటిజన్స్‌ ఒక్కసారిగా అల్లు అర్జున్‌ను చూసినంత ఫీలింగ్ వచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో బన్నీ ఫ్యాన్స్‌ రచ్చ అంటే ఆ మాత్రం రేంజ్‌ ఉంటుందని పోస్ట్ చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 5న విడుదల కానుంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ల్ బుకింగ్స్‌ కూడా పూర్తయ్యాయి.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)