Breaking News

సినిమా ఫెయిల్‌.. నాకు బాగా కలిసొచ్చింది: నటి

Published on Sun, 01/04/2026 - 19:20

హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్‌ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్‌ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్‌ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.

ట్రై చేశా..
సినిమా రిజల్ట్‌ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్‌కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్‌ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్‌డ్‌ గేమ్స్‌, అభయ్‌ వంటి ప్రాజెక్టులలో సీరియస్‌ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్‌గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. 

నేనే ధైర్యం తెచ్చుకుని..
ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్‌ మన చేతుల్లో ఉండదు.

నా లైఫ్‌ నాది
మస్తీ 4 మూవీలోని అడల్ట్‌ జోక్స్‌పై జరిగిన ట్రోలింగ్‌ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్‌ను నా ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్‌ చెప్పుకొచ్చింది. 

చదవండి: 'మా జీవితాల్లో విలన్‌ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)