Breaking News

ఎంత స్టార్ హీరో అయినా ఆమె చెప్పులు మోయాల్సిందే!

Published on Tue, 04/04/2023 - 18:34

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఫైటర్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె జంటగా కనిపించనుంది. అయితే 2014లో  తన భార్య సుసానే ఖాన్‌తో హృతిక్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత  సింగర్ సబా ఆజాద్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్‌ ప్రారంభోత్సానికి తన లవర్‌తో కలిసి పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో హృతిక్ చేసిన పనికి నెటిజన్స్ షాకవుతున్నారు. 

తాజాగా ముంబయిలో జరిగిన ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోల్లో అమిత్, సబాతో ఫోటో దిగుతుండగా వెనకాలే హృతిక్ చేతిలో హీల్స్ పట్టుకుని కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. తన లవర్ సబా హీల్స్‌ను హృతిక్ చేతులతో పట్టుకుని కనిపించడంతో ఫ్యాన్స్‌ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో లవర్‌పై ప్రేమ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు హృతిక్ చేసిన పనికి షాకవుతున్నారు.  ప్రియురాలి హీల్స్‌ను చేతుల్లో మోస్తున్న హృతిక్ సింప్లిసిటీకి మెచ్చుకోవాలంటూ పోస్ట్ చేశారు. 

అయితే గతేడాది డిన్నర్ డేట్‌లో కనిపించిన తర్వాత ఇద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ జంట ముంబైలోని జుహు ప్రాంతంలో దాదాపు రూ.100 కోట్ల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాకుండా ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఈ జంట కలిసే వెళ్తున్నారు. ఆ తర్వాత కూడా హృతిక్ ఫ్యామిలీతో గెట్-టుగెదర్, కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలో జంటగా కనిపించి తమ రిలేషన్‌షిప్‌ను కొనసాగించారు. మరోవైపు హృతిక్ మాజీ వైఫ్ సుసానే ఖాన్‌.. అర్జున్ రాంపాల్‌తో క్లోజ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)