Breaking News

జూనియర్‌ ఎన్టీఆర్‌ నా ఫేవరెట్‌ హీరో.. కానీ భయమేస్తోంది: హృతిక్‌ రోషన్‌

Published on Sat, 04/05/2025 - 18:17

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ 'డ్రాగన్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్‌లో హృతిక్‌ రోషన్‌ 'వార్‌ 2' మూవీ (War 2 Movie)లోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జార్జియాలో జరిగిన వార్‌ 2 ఈవెంట్‌లో హృతిక్‌ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హృతిక్‌ (Hrithik Roshan) మాట్లాడుతూ.. వార్‌ సినిమా సీక్వెల్‌ ఎలా ఉంటుందోనని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడీ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది. మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంటుంది.

ఎన్టీఆర్‌తో డ్యాన్స్‌..
జూనియర్‌ ఎన్టీఆర్‌ నా ఫేవరెట్‌ కోస్టార్‌. తను అద్భుతమైన వ్యక్తి, చాలా తెలివైనవాడు. ఒక పాట మినహా మిగతా షూటింగ్‌ అంతా పూర్తయింది. ఆ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్‌ చేయాలంటే కాస్త భయంగా ఉంది. తను ఎలాగైనా చేయగలడు. నేను కూడా బాగా డ్యాన్స్‌ చేస్తానని అనుకుంటున్నాను. మీరు మా సినిమాను తప్పక ఆదరించాలి అని చెప్పుకొచ్చాడు. వార్‌ 2 విషయానికి వస్తే.. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో తారక్‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఇకపై డైరెక్టర్‌గానూ..
హృతిక్‌ రోషన్‌ నెక్స్ట్‌ 'క్రిష్‌ 4' సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంతో అతడు దర్శకుడిగా మారనున్నాడు. '25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ప్రవేశపెట్టాను.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని హృతిక్‌ తండ్రి రాకేశ్‌ ఇటీవల సోషల్‌ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.

చదవండి:  జైలు నుంచి విడుదల, మహేశ్‌ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్‌.. వీడియో వైరల్‌

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)