Breaking News

హృతిక్, జూ.ఎన్టీయార్‌ల మధ్య ‘వార్‌’కి టైమ్‌ బాగుందట!

Published on Thu, 01/09/2025 - 16:30

ప్రముఖ బాలీవుడ్‌ అగ్రనటుడు హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) తదుపరి చిత్రం వార్‌ 2(War 2) పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీయర్‌ సైతం నటిస్తుండడంతో దక్షిణాదిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ప్రముఖ బాలీవుడ్‌ జ్యోతిష్కుడు ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కానుందంటూ జోస్యం చెప్పడం విశేషం.

బాలీవుడ్‌లో ప్రఖ్యాత జ్యోతిష్కుడు విక్రమ్‌ చంద్రరమణి హృతిక్‌ జ్యోతిష శాస్త్ర చార్ట్‌ను విశ్లేషించారు, దీని ప్రకారం 2025 అతని కెరీర్‌లో కీలకమైన సంవత్సరంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హృతిక్‌ తన కెరీర్‌లో 10వ సూర్య దశను అనుభవిస్తున్నాడనీ ఈ సూర్య దశ జూలై 2025లో ముగిసి చంద్ర దశగా మారుతుందనీ ఆయన వివరిస్తున్నారు. ఆల్‌–టైమ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘కహో నా... ప్యార్‌ హై’ (2000) సమయంలోనూ హృతిక్‌ విజయంలో  వీనస్‌ కీలక పాత్ర పోషించిందని జ్యోతిష్కుడు విక్రమ్‌ అంటున్నారు. 

అదే విధంగా ఈ ఏడాది  కూడా హృతిక్‌కు అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పారు. హృతిక్‌ వ్యక్తిగత  వృత్తి జీవితంలో కీలక పరిణామాలు ఈ ఏడాది ప్రధమార్ధంలో  జరిగే అవకాశం ఉందనీ,  జనవరి  ఫిబ్రవరిలో రియల్‌ ఎస్టేట్, స్టాక్‌లు లేదా ప్రైవేట్‌ ఈక్విటీలో వ్యూహాత్మక పెట్టుబడులు ఆయన పెడతారని కూడా జ్యోతిష్కుడు చెబుతున్నారు.  

బహుభాషా చిత్రాల ఒప్పందాలతో సహా, వినోద పరిశ్రమలో తన స్థాయిని మరింతగా విస్తరించవచ్చునన్నారు.  అలాగే ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో కూడా హృతిక్‌ కొత్త మార్గాలను, నైపుణ్యాలను సంపాదించడంతో పాటుగా తన సినిమాల పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా మారుస్తారని చెప్పారు. 

హృతిక్‌ గత చిత్రాలలో ’వార్‌’ (2019) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక ’విక్రమ్‌ వేద’ (2022),  ’ఫైటర్‌’ (2024) విమర్శకుల ప్రశంసలు పొందడంతో సరిపెట్టుకున్నాయి.  మరోవైపు ఈ ఏడాది జనవరి 10న హృతిక్‌ రోషన్‌ తన 51వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ  తరుణంలో,  ఆయనకు ఇది మరో విజయవంతమైన  సంవత్సరం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

ఈ ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా  విడుదల కానున్న  వార్‌ 2 హిందీ సినిమాల్లో రికార్డ్‌–బ్రేకింగ్‌ ఓపెనర్‌గా  అంచనా వేస్తున్న నేపధ్యంలో పండితుడు చెప్పిన ఈ జోస్యం అభిమానులను సంతోషపెట్టేదే అని చెప్పాలి. మరోవైపు జోస్యం ఫలించి ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిస్తే ఈ సినిమాలో తొలిసారి విలన్‌గా నటిస్తున్న జూ.ఎన్టీయార్‌(Jr NTR) బాలీవుడ్‌ కెరీర్‌ కూడా మలుపు తిరగడం ఖాయంగానే కనిపిస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)