Breaking News

యశ్‌తో 'టాక్సిక్‌' బ్యూటీ.. ఎవరో తెలుసా?

Published on Fri, 01/09/2026 - 16:14

సుమారు నాలుగేళ్ల తర్వాత   కన్నడ స్టార్ యశ్ మరోసారి బాక్సాఫీస్ వద్దకు రానున్నాడు. తన కొత్త సినిమా టాక్సిక్‌ నుంచి యశ్‌ను పరిచయం చేస్తూ టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఒక శ్మశానంలో శత్రువులకు చుక్కలు చూపించేలా తన ఎంట్రీ ఉంటుంది. అయితే, కారులో ఒక నటితో యశ్‌ ఇంటిమేట్‌  అయ్యే సీన్‌ ఉంటుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత బోల్డ్‌గా ఎలా తెరకెక్కించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే, యశ్‌తో రొమాన్స్‌ చేసిన నటి  ఎవరు అంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు వెతుకుతున్నారు.

ఈ టీజర్‌లో యశ్‌తో కలిసి సన్నిహిత సీన్‌లో కనిపించింది హాలీవుడ్‌ నటి 'బీట్రీజ్ టోఫెన్‌ బాఖ్‌'  (Beatriz Taufenbach)..  ఉక్రెయిన్‌కు చెందిన ఈ బ్యూటీ అమెరికాకు వెళ్లి, నటనలో కెరీర్ ప్రారంభించింది. నటనతో పాటు మోడల్, స్క్రీన్‌రైటర్, నిర్మాతగా కూడా విజయం అందుకుంది. తన నెట్‌ వర్త్‌ కూడా సుమారు రూ. 150 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తనను తక్కువ అంచనా వేశారో పప్పులో కాలేసినట్లే..

అమెరికన్ పౌరసత్వం పొందిన తరువాత, ఆమె పలు స్టూడియోస్‌లలో కూడా భాగస్వామిగా ఉంది. హాలీవుడ్‌లో యాక్షన్ సినిమాలతో పాటు థ్రిల్లర్ మూవీస్‌తో పేరు తెచ్చుకున్న బహుముఖ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. అయితే, టాక్సిక్‌ సినిమాతో ఆమె ఇండియన్‌ స్క్రీన్‌పై కనిపించనుంది. ఇందులో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యశ్‌తో బోల్డ్‌ సీన్‌లో నటించడంతో ఒక్కసారిగా నెట్టింట తన పేరు వైరల్‌ అవుతుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)