Breaking News

స్కంద క్లైమాక్స్ సీన్‌పై ట్రోల్స్‌.. కౌంట‌ర్ ఇచ్చిన రామ్

Published on Sat, 11/04/2023 - 20:31

ఓప‌క్క ట్రోలింగ్‌.. మ‌రోప‌క్క ట్రెండింగ్‌.. బోయ‌పాటి సినిమాకే సాధ్య‌మైంది. సోష‌ల్ మీడియాలో స్కంద సినిమా త‌ప్పొప్పులను ఎత్తిచూపుతూ డైరెక్ట‌ర్‌ను ఏకిపారేస్తున్నారు నెటిజ‌న్లు. మ‌రోవైపు హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న స్కంద‌ను ఎగ‌బ‌డి మ‌రీ చూస్తున్నారు జ‌నాలు. కాగా సెప్టెంబ‌ర్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ నవంబ‌ర్ 2న ఓటీటీలో విడుద‌లైంది. ఓటీటీలో ప్ర‌తి స‌న్నివేశాన్ని జూమ్ చేసి మ‌రీ చూస్తున్నారు. ప్రేక్ష‌కులు.

ఫైట్ సీన్‌లో బోయ‌పాటి..
ఈ క్ర‌మంలో ఓ ఇంట‌ర్వెల్ ఫైట్‌లో రామ్ ఓ పోలీస్‌ను షూట్ చేసి చంపేస్తాడు. ఆ త‌ర్వాతి ఫ్రేమ్‌లో ఆ సీన్‌ను చూసి షాక‌వుతున్న వారిలో ఆ చ‌నిపోయిన వ్య‌క్తి క‌నిపిస్తాడు. దీంతో ఈ సీన్‌పై నెట్టింట విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రుగుతోంది. అలాగే క్లైమాక్స్ ఫైట్‌లో రామ్ దీప‌స్తంభాలు ప‌ట్టుకుని విల‌న్ల‌ను చంపుతాడు. ఈ సీన్‌లో తేడాను గ‌మ‌నించారు ఓటీటీ ఆడియ‌న్స్‌. ఈ స‌న్నివేశంలో మొద‌ట రామ్ పోతినేని క‌నిపించ‌గా త‌ర్వాతి షాట్‌లో రామ్‌కు బ‌దులుగా బోయ‌పాటి ద‌ర్శ‌న‌మిచ్చాడు. దీంతో ఈ సీన్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై హీరో రామ్ స్పందించాడు.

కాలి నుంచి ర‌క్తం,, న‌డ‌వ‌లేని స్థితిలో..
'22 ఏప్రిల్, 2023 ఆ రోజు నాకు బాగా గుర్తుంది. వేస‌వి కాలంలో అత్యంత వేడిగా ఉన్న రోజుల్లో ఇది కూడా ఒక‌టి. మొత్తం 25 రోజుల షెడ్యూల్‌లో అది మూడ‌వ రోజు.. అప్పుడు నా కాలి ప‌రిస్థితి ఎలా ఉందో ఫోటోలో చూడొచ్చు. క‌నీసం న‌డ‌వ‌లేక‌పోయాను. కాలి ప‌గుళ్ల నుంచి ర‌క్తం కారింది. ద‌ర్శ‌కుడు ఆ స‌న్నివేశం షూట్ అయిపోవాల‌న్నాడు. నా ప‌రిస్థితి బాలేక‌పోవ‌డంతో ఆ ఒకే ఒక్క సీన్‌లో త‌ను న‌టించాడు.  అందుకు ద‌ర్శ‌కుడికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.

చెమ‌ట చిందించేందుకు ఎప్పుడూ సిద్ధం
సినిమాలోని కంటెంట్ న‌చ్చ‌డం, న‌చ్చ‌క‌పోవ‌డం అనేది మీ అభిప్రాయం. దాన్ని నేను గౌర‌విస్తాను. మీకు వినోదాన్ని అందించ‌డం కోసం నేను ర‌క్తం, చెమ‌ట చిందించ‌డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను' అని ట్వీట్ చేశాడు. దీనికి గాయ‌ప‌డిన కాలి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు 'మీ క‌ష్టానికి విజ‌యం ద‌క్క‌క‌పోయినా ప‌ర్వాలేదు కానీ క‌నీసం అభినంద‌న‌లైనా ద‌క్కితే బాగుండేది' అని కామెంట్లు చేస్తున్నారు.

చ‌ద‌వండి: శోభ సేఫ్‌, తేజ ఎలిమినేట్‌.. చేసిన పాపం ఊరికే పోతుందా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)