Breaking News

'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!

Published on Tue, 12/09/2025 - 17:43

కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్‌ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు.

మరి కోలీవుడ్‌ ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడ? అని కార్తీ ప్రశ్నించారు. వాళ్లలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే.. భయానికి దూరంగా ఉండాలన్నారు. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందని సూచించారు. సరిహద్దులు చెరిపేసి తమిళ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కార్తీ వెల్లడించారు.

(ఇది చదవండి: భారీ ధరకు ది రాజాసాబ్‌ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?)

అంతేకాకుండా ఓ నటుడిగా వా వాతియార్‌ తనకు రిస్కీ సబ్జెక్ట్‌ అని కార్తీ అన్నారు. ఈ సినిమా కత్తితో సావాసం చేయడం లాంటిదని.. తమిళ నటుడు దివంగత ఎంజీఆర్‌ను అనుకరించడాన్ని ఉద్దేశించి కార్తి మాట్లాడారు. దర్శకుడు నలన్‌ కుమారస్వామి కథ చెప్పినప్పుడు నటించేందుకు సందేహించా.. కానీ తర్వాత ఓకే చెప్పానని తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)